పుట:మధుర గీతికలు.pdf/212

ఈ పుట ఆమోదించబడ్డది


అనుచు మానసమున నిశ్చయంబు చేసి
నమ్మికొనియుంటి వానినె నాఁటినుండి;
అధికదయతోడ నన్ను వాఁ డాదరించి
నూతనోత్సాహ ధై ర్యముల్‌ నూలుకొలిపి,

బుజ్జగించి, భయం బెల్ల నుజ్జగించి,
దుఃఖ మెడఁబాపి, కష్టంబు తొలఁగ జోపి,
కుడువ కూడును కట్టంగ గుడ్డ నిచ్చి,
తనివి తీరఁగ ధన మిచ్చి మనిచె నన్ను.

మున్ను నను జూచి మూతులు ముడిచికొనుచు
చనిన మిత్రులు మందహాసమున నేఁడు
చనవుమై వచ్చి యింద్రుఁడు చంద్రుఁ డంచు
స్తోత్రములు చేయసాగిరి చుట్టు మూఁగి.

అంత నే నిట్లు తలఁచితి స్వాంతమందు;,
'ని న్నొసంగిన దేవుని, నిన్నుదక్క
అన్యు లెవ్వరి నింక నే నాశ్రయింప
దక్షిణకరంబ! నీ కిదే దండ మయ్య!'

31