పుట:మధుర గీతికలు.pdf/210

ఈ పుట ఆమోదించబడ్డది

నాదు మేలైన కుడిచేయి


కష్టములు హెచ్చె, పేదరికంబు వచ్చె;
ఇట్టితఱి నాదు స్నేహితు లెవ్వరైన
ఆదరంబున ధన మిచ్చి యాఁదుకొనరె;
అనుచు వెదకితి వారికై యాస మీఱ.

అకట! నా యాస లన్నియు వ్యర్థ మయ్యె-
ఒక్క రొకరుగ హితు లెల్ల నోసరిలిరి,
మార్మొగంబులు వెట్టిరి కూర్మిసఖులు,
పెదవి విఱుచుచు బంధువుల్‌ విడిచి చనిరి.

ఎన్నఁ డైనను కష్ట మాసన్నమైన
ఉసురు లైన నొసంగి న న్నుద్దరింతు
మనుచు బీరంబులాడిన యట్టివార
లొక్కరును నాకు తోడ్పడ నొల్లరైరి.

29