పుట:మధుర గీతికలు.pdf/21

ఈ పుట ఆమోదించబడ్డది

10

వంతుడైన విద్యార్ధి యనియు, ఆతని విద్యాభ్యాసవిషయమున ఎట్టి చింతకును తావులే "దని పద్మనాభముగారికి నమ్మబలుకుటే కాదు ఈ విషయములన్నియు గ్రహించిన వెంకటకృష్ణయ్య నాల్గవ ఫారము పరీక్షాపత్రమునకు పద్యములతో ప్రత్యుత్తరములు వ్రాయగా ఆ పత్రములను దెచ్చి పద్మనాభముగారికి చూపి వారి విచారమును పోగొట్టగల్గిరి,

ఈ సంఘటన జరిగిన వెనుక కొడుకు ప్రయోజకుడే కాక, సదాచార నిష్ఠాపరుడనియు, కవీశ్వరుడు కాదగిన భవిష్యత్తు కలవాడనియు తెలిసికొని, కామరాజుగారు కొడుకును రాణగరికి పిలిపించుకొనిరి.

వెంకటకృష్ణయ్య బాలహృదయమునందు జరుగుచున్న సంఘ సంస్కార సంఘర్షణ శ్రీ కామరాజుగారు గుర్తించిరో లేదో కానీ, వెంకటకృష్ణయ్య యందలి సంస్కార భావావేశ మాతనిని కృష్ణరావుగా మార్చివేయుటయేకాక, గ్రంధాలయ స్థాపన ద్వారా, ఆంధ్రభాషాభివృద్ధి కావింపవలెనను తీవ్రసంకల్పమును కల్గించుటయే కాదు ఆ కాలము నాటికి ఉద్యమముగా రూపులు దిద్దుకొనుచున్న సత్యాగ్రహోద్యమమున చేరి దేశసేవ చేయవలెనను దృఢ సంకల్పమును సహితము కల్గించెను..

ఈ భావుకతా తీవ్రతయొక్క దివ్య స్పూర్తియే. 1898 వ సంవత్సరమునందు జరిగిన వీరేశలింగ గ్రంథాభాండాగార ప్రతిష్ఠాపనము. అదియే క్రమక్రమముగా వృద్ధిచెంది, ఉన్నతినంది వసురాయ గ్రంథమండలి, సర్వజన గ్రంథమండలి యను పేర్లు