పుట:మధుర గీతికలు.pdf/207

ఈ పుట ఆమోదించబడ్డది

సోలమన్ చక్రవర్తి


చారుతరకీర్తి సోలమన్‌ చక్రవర్తి
విక్రమంబున ధారుణీచక్ర మెల్ల
పాలనము చేయుచుండంగ, వచ్చె వాని
సింహపీఠిక చెంతకు 'షీబ' రాణి,

వాని మహనీయ సురుచిరవర్తనంబు,
వాని యనుపమ శేముషీవై భవంబు,
వాని రమణీయ మధురవాక్పాటవంబు
కాంచు వేడుకతో నేగుదెంచె రాణి.

నిండుకొలువున ఱేనిసన్నిధిని నిలిచె
పువ్వుగుత్తులఁ గేల్దోయిఁ బూని రాణి;
ప్రకృతి సుకుమార సౌందర్యభరిత మొకటి,
రమ్య కృత్రిమ నవకళారచిత మొకటి.

26