పుట:మధుర గీతికలు.pdf/204

ఈ పుట ఆమోదించబడ్డది

చేఁపల వేఁట


మొలకసంజలు తొలిదెస తొలకరించె
నింగి నప్పుడె భానుండు తొంగిచూచె
మసక మసకని మబ్బులు మసలఁ జొచ్చె
చిటపొ టంచును చిటిపొటి చినుకు రాలె.

జాలెయును కోల బుజమున వ్రేలవైచి
చల్దిచిక్కము పెరకేల సవదరించి
ఈడుబాలురతోఁ గూడి వేడు కలర
వెడలె రంగఁడు చేఁపల వేఁటలాడ.

వడి హుటాహుటి నడలతో నడచి, యంత
చెంతఁ గాంచిరి వా రొక్క చిన్నపడియ;
'ఎంత చక్కని చెఱువురా యిద్ది!' యనుచు
వలలు వైచిరి తోఢనే వారలందు.

23