పుట:మధుర గీతికలు.pdf/203

ఈ పుట ఆమోదించబడ్డది


ఇంక నొకమాట చెప్పెద - ఎల్లి నీవు
విన్నువీథిని విహరించువేళ, వాని
వెంటఁ గొనిరమ్ము, వాని కే విన్నవింతు;
సమ్ముఖమ్మున రాయబారమ్ము లేల?

చిత్ర మది యేమియో కాని, చెప్పఁజాల
నిన్ను చూచినతోనె నా కన్నకొడుకుఁ
గాంచినటు లుండు, కాన నా కస్తి యెల్ల
తెలిపికొంటిని - ఇఁక పెక్కుపలుకు లేల?

కడుపుతీపుకొలందిని నుడివినాఁడ,
నీ వెఱుంగని ధర్మంబు లెందు నైనఁ
గలవె? నీటను ముంచెదో, కరుణ నన్ను
పాల ముంచెదవో? నీదె భార మయ్య.

తూర్పుదిక్కున నల్లదే తొంగిచూచు
చుండె బాస్కరుఁ, డింక నీ వుంటి వేని
కరఁగిపోఁగల వాతని కిరణములను
మూసలోఁ బడ్డ బంగారుపూస భంగి.

22