పుట:మధుర గీతికలు.pdf/20

ఈ పుట ఆమోదించబడ్డది

9

బాల్యముననే కృష్ణరావుగారు చదువు మాటెట్లున్నను, సాములు చేసి పరోపకార జీవితమునకు ఓంకారము దిద్దిరి.

తల్లి గర్భము నుండి ధరణిపై పడిన వెంటనే చేసిన రోదనము నాలించి, తన యీ కడపటి సంతానమైన, వెంకటకృష్ణయ్య ఎంతో ప్రాజ్ఞుడుకాగలడనియు, తన వంశ మీ కడగొట్టుబిడ్డ యొక్క సత్కార్యములచే ఘన ప్రతిష్ఠనందు ననియు సంభావన చేసిన, వెంకటకృష్ణయ్య విద్యాభ్యాసమునకై ఎన్నో ఏర్పాట్లు చేసిన కామరాజుగారు, తన కొడుకు దుడుకునకు ఎంతగనో చింతాక్రాంతులై కాకినాడ మకామున నోడ వ్యాపారము గావించుచున్న తన మూడవ కుమారుడు పద్మనాభము దగఱకు వెంకట కృష్ణయ్యను పంపివేసిరి.


కాకినాడలో వెంకటకృష్ణయ్యకు తన సాహసకృత్యములకు, సత్కార్యములకు సహకరించు సహవాసగాండ్రు దొఱకక అట్టి కార్యకలాపముల నొనరింపకపోయినను, అపుడే ఆంధ్రదేశమున అడుగు మోపుచున్న బ్రహ్మ సమాజ కార్యకలాపములకు కాకినాడ కేంద్రమగుటచే బ్రహ్మ సమాజోపన్యాసముల కాకర్షితుడై వెంకటకృష్ణయ్య అక్కడ కూడ చదువు సంధ్యల పట్ల అంత ఆసక్తి చూపడయ్యెను.

తమ్ముని హితచింతకుడైన పద్మనాభముగారికీ తమ్ముని వింత ప్రవృత్తి చింతా కారణముకాగా, వారు ఉన్నత పాఠశాలా పండితులతో తమ్ముని విద్యావిషయమున మంతనము గావింపదొడంగిరి. కానీ ఉపాధ్యాయులెల్లఱును ఏకగ్రీవముగా వెంకటకృష్ణయ్య వివేక