పుట:మధుర గీతికలు.pdf/197

ఈ పుట ఆమోదించబడ్డది


వినఁబడవు వాని నవ్వుల వికవికలును,
తళుకు బంగరుమువ్వ ల గలగలలును,
తప్పుటడుగుల చిటిపొటి చప్పుడులును;
అక్కటా! ఎందు నున్నాఁడొ యనుఁగుబిడ్డ?

అంత తణాకున నెద్దియో స్వాంతమందు
జ్ఞప్తిరా, తల్లి పశువులశాల కరిగి
'బైరవీ:' యని దిక్కులు మాఱు సెలఁగ
పిలిచె పెంపుడుకుక్క నుత్తలము మీఱ.

గొంతు బొంగురు వో నామె యెంతసేపు
పిలిచినను గాని, బైరి తాఁ బలుకదయ్యె;
అకట? పెనుచేటు వాటిల్లె ననుచు నామె
బావికడ కేగె రొమ్మును బాదుకొనుచు.

అంతఁగాంచిరి వా రొక్క యద్బుతంబు;
బాలుఁ డెగబ్రాకుచుండె నా బావిగట్టు,
బిడ్డచొక్కాయి నోటితో బిగ్గఁ బట్టి
లావుమై బైరి క్రిందికి లాగుచుండె.

16