పుట:మధుర గీతికలు.pdf/196

ఈ పుట ఆమోదించబడ్డది

విశ్వాసముగల కుక్క


ఏడి నా ముద్దుపాపాయి? ఏఁడి! ఏఁడి!
నిమున మేనియు నొకచోట నిలువఁబోడు
దుడుకుబుడుఁతడు, వాఁడెంత దుండగీఁడె!
చూడవే దాది! ఎచట నున్నాఁడొ వాఁడు.

తల్లిపలుకుల నాలించి దాది యేగి
గదులు వాకిళ్ళు దొడ్డులు వెదకి వెదకి
వాని సడిజాడ నెచ్చోటఁ గాన లేక,
మొగము వెలవెల వోవంగ మగుడి వచ్చె.

గుండియలు జల్లు జల్లని కొట్టుకొనఁగ
తల్లి వెడలెను వెదుకంగ దాదితోడ,
మాఱుమూలల వెదకిరి వారు పూని;
ఏడ వెదకిన కానంగరాఁడు బిడ్డ.

15