పుట:మధుర గీతికలు.pdf/194

ఈ పుట ఆమోదించబడ్డది

బిచ్చగాఁడు


మూపుపై చినిగిన బొంత వ్రేలాడ,
ఒకచేత జోలెయు, నొకచేత కోల
పుచ్చుక తిరుగాడె బిచ్చగాఁ డొకఁడు
వాడవాడల వెంట పాడుచు నిట్లు;

'అవనితలంబున ఆదిభిక్షుకుని
అపరావతారమై అవతరించితిని;
పృథివిలోఁ గలయట్టి వృత్తులలోన
బిచ్చంపువృ త్తియె హెచ్చైన వృత్తి;
చెట్టునీడలె నాకు పట్టెమంచములు,
చినుగు బట్టలె నాకు చీనాంబరములు,
పుట్టగోచియె నాకు పట్టుపుట్టంబు.
భిక్షాన్నమే నాకు పిండివంటకము,
బూదిపూఁతయె నాకు పునుఁగు జవ్వాది,
పూరికొంపయె నాకు భూరిసౌధంబు;

13