పుట:మధుర గీతికలు.pdf/192

ఈ పుట ఆమోదించబడ్డది


మెడలు సారించి తొండలు మిన్ను చూచె
దుమ్ము మైనిండ పిచ్చుకల్‌ జిమ్ముకొనియె
బురదలో నూరపందులు పొరలియాడె
దున్నపోతులు తిరుగాడె దుండగమున.

ఒండుపిఱుఁదను వేఱొండు పిండుగట్టి,
నీడలను జేరి మేకలు నెమరువెట్టె;
కుజము కొనకొమ్మ డిగి క్రిందికొమ్మమీఁద
నిలిచి పులుఁగులు కిలకిల యెలుఁగు లిడియె.

మేఁత సాలించి యావు లంబే యటంచు
మరలి యింటికిఁ జనుదెంచె మందగొనుచు;
పొదుఁగుదూఁటులు వదలి క్రేపులు తొలంగి
మొదవుకదుపుల మాటున నొదిఁగియుండె.

ఏటిదరి బారులై యున్న తాటిచెట్లు
కొనరి యొండొంటి డిక్కీలు కొట్టుచుండె;
చింతకొమ్మలఁ గూర్చుండి జెముడుకాకు
లల్లనల్లన ఱెక్కల నార్చుచుండె.

11