పుట:మధుర గీతికలు.pdf/190

ఈ పుట ఆమోదించబడ్డది


      తల్లి : వాఁడు నీచెంత కెన్నఁడు రాఁడు మరల,
              నీవు నాతని పొంతకు బోవ లేవు;
              పాపిమృత్యువు మి మ్మెడబాయఁ జేసె,
              జాలి నీలీల వాపోవ నేల వత్స:

బాలుఁడు: అన్నదమ్ముల నెడఁబాప నక్కటకట!
              చెనటిమృత్యువ: నీ కేమి చేటు మూఁడె?
              అతఁడు లేకున్న నే నింక బ్రతుకఁ జాల
             నన్ను గొనిపొమ్ము నాతమ్ముఁ డున్నయెడకు.

9