పుట:మధుర గీతికలు.pdf/19

ఈ పుట ఆమోదించబడ్డది

8

నగరమువందేవేవో కార్యకలాపములను దీర్చుటకు, మంది మార్బలముతో తిరుగాడుచున్న కుమారుడు వేంకటకృష్ణయ్య, భోజన సమయమునకును ఇంటికి రాకపోవుసరికి, కామరాజుగారు కోడలిని పిలిచి 'అమ్మన్నా, నీ కొడుకెక్కడ ఏ దీనజనోద్దరణ కార్యక్రమమున, ఆకలి దప్పులు మఱచి నిమగ్నుడై యున్నాడో ? మఱి, పెట్టె బండి (నాళము కామరాజుగారి అంతఃపుర స్త్రీలు వీధిలోని వారికి కనబడకుండా వెళ్లు బండి) వెళ్లి, వాడికి కావలసిన డబ్బిచ్చి యింటికి తీసుకొని రా తల్లీ' అని కోడలిని పంపెడువారు : ఒకనాడు ధవళేశ్వరమందలి ఆప్త మిత్రుని యింట యేదో ఆపద సంభవించి డబ్బుచాలక వారు బాధ పడుచుండగా ఆ కుటుంబము నా సందర్భమునందు ఎట్లు ఆదుకొనవలెనా? యని ధవళేశ్వరము దగ్గఱ కల గౌతమీ తీరమునందలి ఒక పెద్ద చెట్టుపై కృష్ణరావుగారి నాయకత్వమున మిత్రబృందమంతయు ఆలోచనా సభాకార్యక్రమమును నిర్వహించుచుఁడగా,ఆ విష యము తెలిసి అమ్మన్నగారు అక్కడికి వెళ్ళి మఱదిని రమ్మని బ్రతిమలాడుటయు. నా స్నేహితుని కిచ్చుటకు వలసినంత డబ్బు తక్షణము నాకిచ్చినగానీ నేనింటికి రాను. ఆ సహాయము జరుగక పోయిన ఇదిగో నేనిపుడే ఈ కొమ్మపై నుండి గోదావరిలోకి పడి పోయెదనని ఆయన మాతృ సమానురాలైన అమ్మన్నగారిని బెదరించుటయు, వెంటనే ఆమె "వెంకటకృష్ణయ్య. ఇదిగో డబ్బు నీ కెంత కావలెనో తీసుకో" మని డబ్బు చూపగా, వెంకటకృష్ణుడు ఆ డబ్బు తీసికొని ఆ స్నేహితునకిచ్చి ఇంటికి వచ్చుటయు జరిగినది.