పుట:మధుర గీతికలు.pdf/189

ఈ పుట ఆమోదించబడ్డది


               మొలక వెన్నెలనవ్వుల గులకరించు
               పోముఁ బోలిన నెమ్మోము గోమువాఁఢు
               నీదు ముద్దులతమ్ముఁడు నిన్ను విడిచి
               స్వర్గసుఖముల చూఱాడఁజనియె కుఱ్ఱ!

               స్వచ్చతరమయి మకరందసహిత మగుచు
               సురుచిరంబగు సుకుమారసుమము వోలె,
               చిన్న దయ్యును తమ్ముని జీవితంబు
               బంధురామోదభరితమై వన్నె కెక్కె.

బాలుఁడు : ఈరములచెంత, అల సెలయేఱుపొంత
               వాఁడు నేనును జతగూడి యాడుచుందు,
               మతఁడు లేకుండ నొంటిమై నాడఁ జాల;
               చెలఁగి యెన్నఁడు వచ్చునో చెప్పు మమ్మ.

               పులుఁగులను వీడి, పువ్వుగుత్తులను వీడి,
               అకట! నను వీడి యరిగెనే అనుఁగుఁదమ్ముఁ?
               డతఁడు రాకున్న నేనైన నతనికడకు
               ఏగువాఁడను, చెప్పుమా; ఎచటి కేగె?

8