పుట:మధుర గీతికలు.pdf/188

ఈ పుట ఆమోదించబడ్డది


         గుజ్జుమామిడి సెలగొమ్మకొనల వ్రాలి
         చివురుజొంపంపు గుబురులు చిదిమి మేసి
         కొదమకోయిల కో యని కూయుచుండె;
         తమ్ముఁడా! అడుకొందము రమ్ము వేగ.

         సగము మేసిన పోఁచలు జాఱిపడఁగ
         బెదరుకన్నుల మాటికి వెనుకఁ గనుచు
         భీతిచే లేడి పరుగులు వెట్టుచుండె;
        తమ్ముఁడా: ఆడుకొందము రమ్ము వేగ.

        అనుదినమ్మును మనము వయ్యాళి వెడలు
        సరసునిండను కలువలు విరియఁబాఱి
        కనులపండువు సేయుచుఁ గానవచ్చె;
        తమ్ముఁడా! ఆడుకొందము రమ్ము వేగ.

తల్లి : గోరువంకలు చిలుకలు మాఱు వలుక
        కఱకు ఱాలును జాలిచే కరఁగిపోవ
        ఎవని పిలుతువొ యెలుఁగెత్తి యింతసేపు,
        వాఁడు నీచెంత కెన్నఁడు రాఁడు బిడ్డ!

7