పుట:మధుర గీతికలు.pdf/187

ఈ పుట ఆమోదించబడ్డది

ఆడుకొందము తమ్ముఁడా!


బాలుఁడు: ఎచట నుంటివి తమ్ముఁడా ఇందు రమ్ము:
              చదలనడుచక్కి వెలుఁగొందె చందమామ !
              పండువెన్నెల లెల్లెడ మెండుకొనియె;
              ఆడుకొందము తమ్ముఁడా! వేడు కలర.

              అల్లదే తేఁటి ఱెక్క లల్లార్చికొనుచు
              కమ్మతేనియ గ్రోలుచు జుమ్మటంచు
             పాడుచున్నది, దానితో వేడు కలర
             తమ్ముఁడా: ఆడుకొందము రమ్ము వేగ.

              పొలములో నీవు నాటిన పూలచెట్లు
              విరివిగాఁ బూచి బటు వయి విఱ్ఱవీఁగి
              గమ్ము గ మ్మని తావులఁ జిమ్ముచుండె;
              తమ్ముఁడా! అడుకొందము రమ్ము వేగ.

6