పుట:మధుర గీతికలు.pdf/186

ఈ పుట ఆమోదించబడ్డది


          మంచుమలలందు నొకసారి మలయుచుందు;
          జలదపంక్తుల నొకమాఱు చౌకళింతు;
          సాగరముమీఁద నొకపరి సంచరింతు;
          పులుఁగులకు మాకు ఋతుభేదములును గలవె?

బాలిక: గిరుల, మబ్బుల, కడలి పైఁ దిరుగునపుడు
          త్రోవ తప్పి భ్రమింపవే తోడు లేక?
          చిన్ని చిలుకరొ? నీ కిట్టి సిలుగు లేల?
          చెలఁగి నాయింట నెపుడు వసింపరాదె?

చిలుక: నోరు లేనట్టి పశు పక్షివారములకు
          తోడుపడు నెవ్వఁ, డాతండె త్రోవ సూపు;
          కిరణముల జిమ్మి, జిగిమబ్బుపొరల జించి
          లీల విహరింతు నిచ్చమై గాలి వోలె.