పుట:మధుర గీతికలు.pdf/185

ఈ పుట ఆమోదించబడ్డది


             తఱపివెన్నెలలందలి తళతళలును
             మించు నునుమంచుబిందుల మిలమిలలును
             కమ్మతెమ్మెరలందలి గమగమలును
             విడిచి నీ యింట కడగండ్లు బడఁగ నేల?

బాలిక : మండు టెండల మలమల మాఁడి మాఁడి
           వానసోనల పలుమాఱు నాని నాని
           మంచుబిందుల మాటికి మాఁగి మాఁగి
           కడిఁది సీతున వడవడ వడఁకి వడఁకి,

           గాసిచెందఁగ నేటికే గండుచిలుక?
           మంజులంబగు నా పైఁడిపంజరమున
           కొంతకాలము తలదాఁచికొనంఁగ రాదె?
           ఇచ్చ కలదేని పిదప పోయెదవు గాని.

చిలుక: మండుటెండలు, వానయు, మంచు, సీతు
          మీకు మనుజులకే కాని మాకుఁ గలవె?
          స్వచ్చతర మగు నిర్వలవాయువులను
          స్వేచ్చమీఱ విహారంబు చేయుచుందు.

4