పుట:మధుర గీతికలు.pdf/184

ఈ పుట ఆమోదించబడ్డది

ఎచటి కేగెదు కీరమా !


బాలిక: ఎచట కేగెదు కీరమా? ఇందురమ్ము
          ఏటి కాయసపడెదవే యెగిరి యెగిరి?
          పసిఁడితీఁగల నల్లిన పంజరంబు
          వ్రేలఁగట్టితి నల్లదే వ్రాలు మందు.

          దోరపండిన నునుపారు దొండపండ్లు
          పరువ మొందిన తీయని పనసతొనలు
          కుడువఁ బెట్టెద నిచ్చలు కడుపునిండ
          ఆరగింపుము కీరమా! హాయి మీఱ.

చిలుక: మోద మందితి బాలరో నీదు దయకు;
          డంబు మీఱిన నీ పంజరంబుక౦టె
          మఱ్ఱిమ్రాఁకున నలరారు తొఱ్ఱలోని
          నాదు వెచ్చని జిగిగూఁడె నాకు హితము.

3