పుట:మధుర గీతికలు.pdf/18

ఈ పుట ఆమోదించబడ్డది

7

బాల్యము నుండియు సంఘశ్రేయస్సునకు భంగము కల్గించు మూఢ విశ్వాసములపై, కుటిల సంస్కారములపై ధ్వజమెత్తి, తిరుగుబాటు సాగించిన విప్లన వీరుడు! సాంఘిక దురాచారములపై ఎంత విద్వేషము కనబఱచెడు వారో, జాతి యందుత్తేజము కల్గించు సంఘ సంస్కార కార్య లాపములన్నను పేద వారైన తోడి సహచరులను ఆదుకోనుట యన్నను, కష్టములలో, ఆపదలలో చిక్కుకొనిన వారికి తోడు పడుట యన్నను, నంత ప్రీతిని చూపుచు. అట్టి కార్యముల యందు ఎంతో అనురక్తితో పాల్గొనెడివారు.

తనకు తండ్రిగారు కాని, ఇతర బంధువర్గము కాని యిచ్చిన ప్రతి పైసను సంఘ ప్రయోజనకరములైన కార్యములకై వెచ్చించుచుండెడు వారు నిత్యము ఇరువది ముప్పదిమంది సహచరులతో ఎవరికో సాయము సల్పుటకై నగరపర్యటన సల్పుచు శైశవదశయందు చదువుకొనుటయందేమియు శ్రద్ధ కనబఱుపక, తనకు చదువు చెప్పుటకై తండ్రిగారు నియోగించిన గురువుగారు తమ యింటికి నిత్యము వచ్చెడు వేళకు తన సహచరులతో గలిసి, గౌతమీ ప్రవాహముల బడికొట్టుకొని పోవు జీవులను కాపాడుటకో, లేక సామూహిక రామభజన కార్యకలాపమునకో, కాక తెలిసిన వారి యిండ్లయందలి అవసరములను దీర్చుటకో పర్వెత్తి పోయెడువారు. బాల్యమునందే మాతృ వియోగమునందిన బాలకృష్ణుని. సంతాన విహీనయైన చిన్న వదిన అమ్మన్నగారు పుత్రసమాన ప్రేమతో దగ్గఱకు తీసి పెంచెడిది.