పుట:మధుర గీతికలు.pdf/177

ఈ పుట ఆమోదించబడ్డది


పానవట్టము తూరుపుపర్వతంబు,
దీపికారాజి తారలు, ధూప మిరులు
గా వెలుంగఁగ, స్పటికలింగంబొ యనఁగ
నిండుచంద్రుఁడు కన్నులపండు వయ్యె.

చిమ్మచీకటికుప్పల చెత్తమీఁ ద
బగ్గుబగ్గున మండెడి యగ్గి వోలె
ఉదయరాగంపుకాంతుల నుజ్వలించి
ఇందుబింబము లోచనానంద మయ్యె.

వెన్నెల యనంగ రాత్రినా వెలయు తనదు
పత్నులిరువుర మెచ్చులఁ బడయఁ గోరి
తెలుపు నలుపులు గలమేన నలరె నన గ
నిండు చంద్రుఁడు కన్నులపండు వయ్యె.

మెల్ల మెల్లన చిఱుచేప లెల్ల మ్రింగి
పెద్దచేప క్రమంబుగ పెరిగినట్లు,
విన్ను కడలిని చుక్కలు సన్నగిల్ల
అంతకంతకు చందురుఁ డగ్గలించె.

42