పుట:మధుర గీతికలు.pdf/173

ఈ పుట ఆమోదించబడ్డది

సూరకవి - క్షత్రియుఁడు


హస్తమున నొక్క తాటాకుపుస్తకంబు
దాల్చి చనుచుండె నొకకవితల్లజుండు;
వానిఁ బొడఁగని “యీవేళ వర్జ్య మెప్పు ?”
డనుచు క్షత్రియుఁ డొక్కరుఁ డడిగె నతని,

అనుడు, వెఱఁ గంది కవివర్యుఁ డనియె నిట్లు
“కవివరుల గుండె లల్లాడ కవిత చెప్ప
పేరు గాంచిన అడిదము సూరకవిని,
తిథులు చెప్పఁగ నేను వైదికుఁడఁ గాను."

"భార మైనట్టి యొక పెద్దభారతంబు
వంటి గ్రంథము చేఁ దాల్చి, వర్జ్య మెపుడొ
చెప్పలే నని నుడువుట సిగ్గు గాదె?"
అనుచు క్షత్రియుఁ డతని హాస్యంబు చేసె.

38