పుట:మధుర గీతికలు.pdf/172

ఈ పుట ఆమోదించబడ్డది


వల్లె యని పల్కి శని యేగె నుల్లసమున;
ఈతఁ డెట్లు బాధించునో చూత మనుచు
దారుణాటవియం౦ దొక్కమాఱుమూల
మడువులో దాఁగె నభవుండు గడువుదాఁక.

అంత నీశుండు తనగిరి కరుగుదెంచి
శనిని బిలిపించి, “ఓరి నీశపథ మేమి
యయ్యె?న న్నేల పీడింప వైతి?" వనుచు
నడుగ, పక్కున నవ్వుచు ననియె నతఁడు.

“విబుధు లెల్లరు సేవింప విభవ మొప్ప
వెండికొండపై ఠీవిఁ గూర్చుండు నీవు
అడవిలో నొక్కమడుఁగున నడఁగియుంట
నాదుమహిమంబు గాక యిం కేది గలదు?"

37