పుట:మధుర గీతికలు.pdf/170

ఈ పుట ఆమోదించబడ్డది


'చాలు చాలును - నీతెల్వి కాలిపోను-
కొమ్ము లేవిర సింగంపుగొదమ యైన ?'
'ఱంతు లేలర ? నీబుద్ధి సంత కేగ_
దానిమెడమీఁద జూ లేది యేను గైన ?'

వార లీరీతి తమలోన వాదమాడి
గురువు నడిగి యధార్థంబు నెఱుఁగఁ గోరి
ఇరువురును రెండువైపుల తఱిమి తఱిమి
ఎట్టకేలకు దానిని పట్టుకొనిరి.

అంత నాలేడి నుత్తరీయమునఁ గట్టి
గురువుచెంతకుఁ గొనితెచ్చి కూలవై చి
'సింగమో యిది యేనుంగొ చెప్పుఁ' డంచు
నడుగ, వారికి గురు విట్టు లానతిచ్చె.

“పనికిమాలిన పరమనిర్భాగ్యులార !
సింగమును గాదు, మఱియు నేనుంగు గాదు;
శీఘ్రముగ పాఱవేయుఁడాచెఱువులోన
ఎగిరితే కప్ప, మునిఁగినయెడల కాకి.”

35