పుట:మధుర గీతికలు.pdf/17

ఈ పుట ఆమోదించబడ్డది

6

ఈ ఆచార్య పరంపరకు చెందిన మాన్యుడు, సుప్రసిద్ధ భాషావేత్త, సంఘ సంస్కారి, గౌతమీ గ్రంథాలయ ప్రతిష్ఠాపకుడు, బాలసాహిత్య పితామహుడు. మధురకవి బిరుదాంకితుడు శ్రీ నాళము కృష్ణరాయసుధిని తన ఒడియందు చేర్చి లాలించి పెంచినదీ నగర రాజ్యమే

పుడమితల్లి పురుటినొప్పులు పడిన ఒక శుభదినమున తూర్పుగోదావరిజిల్లా యందలి మండపేట గ్రామమునందు, అంతర్జాతీయ నౌకా వ్యాపారదక్షుడు, కలకత్తానుండి, మద్రపురి వఱకు బహు సత్రములను నిర్మించి మించిన ప్రజాహిత జీవనుడు, ముద్రాపిత సంస్కృతాంధ్రానేక మహా కావ్యమనీషి, బహువితరణ శీలి. ఉదారగుణ చరిత్రసంస్కారము కల దొడ్డ మానిసి. దుర్మార్గులకు పక్కలో బల్లెము. ఆశ్రిత బహుపండితానీకుడు అయిన నాళము కామరాజు, లక్ష్మమ్మల గర్భశుక్తి ముక్తాఫలముగా నాళము కృష్ణరావుగారు వారి కడపటి సంతానముగా 1881 లో జన్మించినారు.

బహు విశ్రుతుడైన నాశము కామరాజుగారు తన ఆత్మజునకు వెంకటకృష్ణయ్య అని నామకరణము చేసినారు. తరువాత కాలాంతరమందు తనకు ఊహవృద్ధియైనపుడు వెంకటకృష్ణయ్యగా తన పేరును తానే కృష్ణారావుగారు మలచుకొని యుండెనేమో!


కష్టరావుగారు బాల్యమునుండియు భావస్వాతంత్య్రము, ఆచరణ వైశిష్ట్యము కల్గిన వింత మానిసి, కుహనా సంస్కారము లన్నను, మూఢాచారములన్నను అనిష్టము చూపుటయే కాక,