పుట:మధుర గీతికలు.pdf/168

ఈ పుట ఆమోదించబడ్డది


“ప్రొద్దుననె లేచి నాపాడుమొగము మీరు
పావనం బగు తావకవదన మేను
నొక్కసారిగ నిరువుర మొకరి నొకరు
కాంచితిమి గాదె యెవ్వరిఁ గాంచకుండ.

నాదువదనంబు గాంచి భూనాధ ! మీరు
పుడమిపై నశ్వముననుండి పడితి రంతె;
కాని దేవరవదనంబు గాంచి నేను
మరణశిక్షకుఁ బాల్పడి మడియనుంటి.

కాన నెవ్వరివదనంబు హనికరమొ
అరసి లెస్సగ దేవర యానతిండు” -
అనుడు, సిగ్గున మాఱు మాటాడలేక
వెంటనే కాఁపువానిని విడిచె ఱేఁడు.