పుట:మధుర గీతికలు.pdf/167

ఈ పుట ఆమోదించబడ్డది


చని జరీలున నంత నామనుజవిభుఁడు
కొలువుకూటమునం జొచ్చి తలవరులను
పిలిచి యాకాఁపువాని రప్పించి యటకు
కనుల నిప్పులు రాలంగ ననియె నిట్లు.

“ఉదయమున లేచి యెవ్వరివదనములను
కాంచకయె తొలుదొల్త నీ కాఁపువాని
మోము జూచితి, నంతట నేమి చెప్ప
నేలపై నశ్వముననుండి కూలినాఁడ.

ఇంక నీతనివదనంబు నెవ్వ రైనఁ
గాంచిరేని ప్రమాదంబు గలుగుఁ గాన
తోడనే వీనిశిరమును త్రుంచివేయుఁ”
డంచు నానతియిచ్చె నాయారెకులకు.

తనకు నెటు లైన మరణంబు తప్ప దనుచు
దిట్టతనమున నాకాపు తెంపు చేసి
హృదయమున నించు కేనియు బెదరుగొనక
పలికె నీరీతి గట్టిగా ప్రభునితోడ.

32