పుట:భాస్కరరామాయణము.pdf/17

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విషయమై తెనుంగురాయ లని యున్నాఁడు. ఈ తెనుంగురాయలనే భీమన 'రాయల గెల్చి' యనియు శ్రీనాథుఁడు 'రాయలయొద్దఁ బాదుకొల్పితి’ననియుఁ గేవల రాయశబ్దముచేఁ బేర్కొనియున్నారు. దీనింబట్టి తెలుంగురాయలకాలమున భీమకవియును శ్రీనాథుఁడు నున్నవారని తెలియుటచేత వీ రిద్ద ఱించుమించుగా నేకకాలమువా రని తేలుచున్నది. శ్రీనాథుఁడు తిక్కనాదులను బూర్వకవులుగా స్తుతించియుండుటచే నతఁడు వారలకాలమువాఁడు గాఁడనుట నిర్వివాదముగదా. కాన శ్రీనాథునికాలమువాఁడగు భీమకవియుఁ దిక్కన కిటీవలివాఁ డగును. కనుక నతఁడు చాటువు చెప్పిన సాహిణిమారనయుఁ దిక్కన కిటీవలివాఁడే యగును. తిక్కన కిటీవలిసాహిణిమారునకుఁ దిక్కనకు మును పుండినమంత్రిభాస్కరుఁ డంకితముగా రామాయణము చెప్పె ననుట యసంగతముగా నున్నది.

ఇంతవఱకును మంత్రి భాస్కరునిఁ దిక్కనకు మునుపటివానినిగా నెంచి యతనికిం గూర్చిన రామాయణకర్తృత్వమును గూర్చి విచారము చేయుచుంటిమి. ఇప్పు డామంత్రిభాస్కరుఁడు, తిక్కన కిటీవల, మునుమూరు సంస్థానపు బుద్ధరాజుకడ మంత్రి యై రంగనాథునకుఁ బ్రతిపక్షిగా నునికిని జెప్పియుండుట విచారింతము, ఈకథయందుఁ గృతిపతి యగు సాహిణిమారయ కొండసీమరాజు గాఁడు; గుఱ్ఱపువాఁ డయ్యెను. ఎట్లన ద్విపద రామాయణమును జేసినరంగనాథుఁడు గోన బుద్ధరాజునకు బంధుఁడు. భాస్కరుఁ డతనియాస్థానపండితుఁడు. రంగనాథుఁడు రాజాజ్ఞను బొంది ద్విపద రామాయణమును రచింపఁబూని రచించుచుండెను. అతఁడు చాలవఱకు రామాయణమును రచించియుండఁగా, భాస్కరుఁ డసూయవలనఁ దా నతనికంటె ముందుగా గద్యపద్యాత్మకముగా రామాయణము రచించి రాజు మెచ్చు వడయవలయు నని మల్లికార్జునాదు లగుమువ్వురసాహాయ్యముచేఁ ద్వరితముగా ముగించి యాస్థానమునకుఁ గొనిపోయెను. అప్పటికి రంగనాథుఁడు దనరామాయణమును ముగించి యాస్థానమునకుఁ దెచ్చియుండెను. రా జాయిరువురవృత్తాంతము నెఱింగి రంగనాథునితట్టు కుడిచేతిని భాస్కరునిత ట్టెడమచేతిని జాఁచెను. భాస్కరుఁ 'డది యేమి’ యని యడుగఁగా, రాజు 'నేను రంగనాథునకు మునుపే కుడిచేతి నమ్మితి' ననెనఁట. అంతట భాస్కరుఁడు కోపించుకొని 'నీవంటిపక్షపాతి కిచ్చుటకంటె నీ గుఱ్ఱపువాని కిచ్చుట మే' లని పలికి కొలువు విడిచి వచ్చుచుండఁగా నారాజు గుఱ్ఱపుదళవా యది విని సభాద్వారమున భాస్కరునితో 'కవిసార్వభౌమా! ఆడినమాట తప్పవల' దని యడ్డపడి మ్రొక్కఁగా భాస్కరుఁడు గ్రంథాది నున్న రాజవంశవర్ణనాదుల నెల్ల నెత్తి వైచి 'సాహిణీమారా'యని ముగియున ట్లొకపద్యము మొదటఁ చేర్చి దీనిని వాని కంకితముఁ జేసెనఁట. కొంద ఱీబుద్ధరాజునకు మంత్రిభాస్కరుడు మంత్రిగా నుండె ననియు నతఁడు రంగనాథునిచే ద్విపద రామాయణమును వ్రాయించుటను జూచి యీసుచేతఁ దాను రాజుతోఁ బద్యకావ్యమును వ్రాయించి తెచ్చి