పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/79

ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌


మహాత్మా గాంధీని ఆహ్వానించారు. ఆయన రాకను నిరోధించేందుకు ప్రబుత్వం గాంధీజీని అరెస్టు చేసింది. ఆ అరెస్టుకు పంజాబ్‌ ప్రజలు తీవ్రంగా స్పందించారు. ఆ సమయంలో అత్యంత క్రూరుడిగా పేర్గాంచిన జనరల్‌ డయ్యర్‌ నేతృత్వంలో సాగుతున్నపోలీసు రాజ్యాన్ని పంజాబు నాయకులు డాక్టర్‌ సైఫుద్దీన్‌ కిచ్లూ, డాక్టర్‌ సత్యపాల్‌ తీవ్రంగా విమర్శించారు. ఆ విమర్శలకు ఆగ్రహించిన ప్రభుత్వం ఆ నేతలను 1919 ఏప్రిల్‌ 10న అరెస్టుచేసి ప్రవాసానికి పంపింది.

ఈ చర్యతో పంజాబు జనం మరింత రెచ్చిపోయారు. ప్రియతమ నాయకులను విడిచిపెట్టమంటూ ఊరేగింపులు జరిపారు. ఆ సందర్బంగా జరిగిన కాల్పులలో నలుగురు మరణించారు, పలువురు గాయపడ్డారు . ఆ సంఘటనలతో మరింత రచ్చిపోయిన ప్రజలు నేషనల్‌ బ్యాంకులోని ఇరువురు ఆంగ్ల అధికారులను హతమార్చారు, గందరగోళం సృష్టించారు. ప్రభుత్వ కార్యకలాపాలను స్తంభింపచేశారు.

అ సంఘటనల తరువాత జాతీయ కాంగ్రెస్‌ నాయకులు ఏప్రిల్‌ 13న అమృతసర్‌లోని జలియన్‌వాలా బాగ్ లో నిరసన సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఆ రోజున వైశాఖి పర్వదినం. ఆ సందర్భంగా జరుగుతున్న సభలో పాల్గొనేందుకు పరిసర గ్రామాల నుండి ప్రజలు భారీ సంఖ్యలో జలియన్‌వాలా బాగ్ కు తరలి వచ్చారు. ఈ సమాచారం తెలుసుకున్న జనరల్‌ డయ్యర్‌ కుట్రపూరితంగా వ్యవహరించాడు. సభా కార్యక్రమాలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు. ఆ ఉత్తర్వులను ప్రజలు ఖాతరు చేయలేదు. జలియన్‌వాలా బాగ్ ఆ రోజున జనప్రవాహంతో నిండిపోయింది. ఆ సభలో పాల్గొనేందుకు ఉమర్‌ బీబీ కూడ అమృతసర్‌కు చేరుకున్నారు.

ప్రజలు భారీ సంఖ్యలో సభాస్థలికి విచ్చేశారు. ఈ స్పందనకు జనరల్‌ డయ్యర్‌ మండిపడ్డాడు . నిప్పుతొక్కిన కోతిలా చిందులేశాడు. సాయుధ బలగాలను వెంటపెట్టుకు ని సబాసలిని చుట్టుముట్టాడు. ముందుగా ఎటువంటి హెచ్చరికలు చేయకుండానే సబికుల మీద కాల్పులు జరిపించాడు. సభాస్థలి చుట్టూ ప్రహరీ గోడ ఉండటం, సభాస్థలిలోకి రాకపోకలకు ఒకవైపు మాత్రమే ఉన్నఇరుకైన ప్రవేశమార్గానికి అడ్డంగా తన సాయుధ బలగాలను మొహరించి కాల్పులు జరిపించిన డయ్యర్‌ కిరాతకత్వానికి పెద్దసంఖ్యలో ప్రజలు నేలకొరిగారు. ఈ దుస్సంఘటనలో ప్రభుత్వ రికార్డుల ప్రకారంగా 378 మంది మరణించగా అందులో 55 మంది ముస్లింలు ఉన్నారు. ఈ సంఖ్య సరికాదని అమరులైలెన


76