పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/77

ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


పడుతున్న బ్రిటిష్‌ పోలీసుల దాష్టీకాలను జ్వలిత నేత్రాలతో గమనిస్తూ ఆవేదన చెందారు. మాతృభూమిని బానిస బంధనాల నుండి విముకం చేయడనికి భారతీయులు సాగిసునfl పోరాటాలను అణిచివేసేందుకు బ్రిటిష్‌ పాలకులు అనుసరిస్తున్న క్రూరవిధానాల మూలంగా దేశంలో అల్లకల్లోల పరిస్థితి నెలకొనియున్న తరు ణంలో ఆమె జీవిత సహచరు డు కన్నుమూశారు. భర్తను కోల్పొయిన ఆమె సంసారం ఒడిదుడుకులకు గురయ్యింది.

ఆర్థిక కష్టనష్టాల కడలిలో పయనం సాగిస్తున్నా కూడ ఉమర్‌ బీబీ జాతీయోద్యామ కార్యక్రమాల పట్ల తనకున్న ప్రత్యే క ఆసక్తిని కోల్పోలేదు . ఆనాడు పంజాబ్‌ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను తెలుసుకుంటూ ఉద్యామకారుల ఉత్సాహానికి ఆనందిస్తూ, ఉద్యమకారులను తన బిడ్డలుగా భావిస్తూ ప్రోత్సహిస్తూ ఆశీర్వదించారు. జాతీయోద్యమ కార్యక్రమాలలో భాగంగా ప్రముఖ నాయకుల సబలకు హాజరుకాసాగారు. ఆ నాయకుల, విప్లవయోధుల ప్రసంగాలను శ్రద్ధగా వినేవారు. ఆ సభలు-సమావేశాల నుండి గ్రామానికి తిరిగి వచ్చి ఆయా కార్యక్రమాల విశేషాలను గ్రామస్తులకు ఆసక్తిదాయకంగా వివరించటం అలవాటు.

ప్రథమ ప్రపంచ యుద్ధంలో భారతీయుల అండదండలు, మద్దతు సంపాదిం చటం కోసం బ్రిీషు ప్రబుత్వం పలు ప్రయ త్నాలు చేసిణ్ది. యుద్ధ సమయంలో పంజాబు నుండి అత్యధికులను భారత సైన్యంలో చేర్చుకుంది. ఈ మేరకు అటు ప్రజలకు ఇటు భారతీయ సైనికులకు పలు హమీలను ఇచ్చింది. ప్రపంచ యుద్ధ్దం తరువాత తాను ప్రకటించిన హామీలను, కల్పిస్తానన్న అవకాశాలను ప్రభుత్వం తుంగలో తొక్కింది. ప్రబుత్వం తన హామీలను చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవాల్సిందిగా ప్రజలు డిమాండ్‌ చేశారు. ప్రజల డిమాండ్‌లను ప్రభుత్వం పట్టించుకోకపోగా అలనాటి హామీలను ప్రస్తావించిన ప్రజల మీద విరుచుకుపడింది. ఈ రకమైన నమ్మక ద్రోహం కారణంగా ఏర్పడిన ప్రతికూల వాతావరణంలో పాలకుల పట్ల అన్ని వర్గాలలో అసంతృప్తి అలుము కుంది. ఆ అసంతృప్తి కాస్తా స్థాయిదాటి ఆగ్రహ రూపుదాల్చింది. ఆ కారణంగా పంజాబులో విప్లవ కార్యకలాపాలు ఊపందాుకున్నాయి.

ఈ వాతావరణంలో 1918 ఆగస్టులో అమృతసర్‌లో డాక్టర్‌ సైఫుద్దీన్‌ కిచ్లూ, ఆయన భార్య సాదత్‌ బానో కిచ్లూల నేతృత్వంలో ముస్లిం జనసముదాయాల నిరసన సభ జరిగింది. ఈ సభలో వక్తలు బ్రిటిషు ప్రభుత్వం అనుసరిస్తున్నప్రజావ్యతిరేక చర్యల 74