పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/73

ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌


ఆమె అసలు పేరు తెలియదు. చరిత్ర ఆమెను ఖుదీరాంకి దీది (ఖుదీరాం అక్కయ్య) గా నామకరణం చేసింది. ఆ పేరుతోనే ఆమె స్వాతంత్య్రోద్యమ చరిత్రలో గణుతికెక్కారు. ఆమె ప్రముఖ విప్లవకారుడు మౌల్వీ అబ్దుల్‌ వహీద్‌ చెల్లెలు. అన్నకు తగ్గ చెల్లెలుగా ఆమె పోరుబాటన నడిచి పోరాట యోధు లకు అండదడలు అందించారు.(Freedom Move ment and Indian Muslims, Santimoy Ray, PPH, New Delhi,1993, Page. 34) భయమెరుగని విప్లవకారుడు ఖుదీరాంను తమ్ముడిగా భావించిన ఆమె అతనికి ఆశ్రయమిచ్చారు. ఆంగ్లేయాధికారి కెన్నడీ (Kennedy) భార్యను హత్య చేసారన్నది ఖుదీరాం మీద ఆరోపణ. బ్రిటిష్‌ మహిళను హత్యగావించాడని ఆగ్రహంతో రగిలిపోతున్న అధికారులు ఖుదీరాం సమాచారం కోసం, ప్రజలపై, విప్లవోద్యమ సానుభూతిపరులపై విరుచుకుపడి, విద్వంసం సృష్టిస్తున్నారు, చిత్రహింసల పాల్జేస్తున్నారు. ఆ పరిస్థితులలో ఆమె ఖుదీరాంను రక్షించపూనుకోవటం సాహసం.

ఆ విషయాన్ని పోలీసులు ఏమాత్రం పసిగట్టినా, ఖుదీరాంతోపాటుగా ఆమె కూడ దారుణ చిత్రహింసలకు గురికావటమేకాక ప్రాణాలను కూడ అర్పించాల్సి వచ్చేది. అటువంటి భయానక వాతావరణంలో కూడ ఆమె భయపడలేదు. అక్కయ్యకు ఏమాత్రం

కష్టం-నష్టం కలిగించటం ఇష్టంలేక కొంతకాలం తరువాత ఖుదీరాం ఆమె వద్ద నుండి

వెళ్ళిపోయారు. అ తరువాత అరెస్టయ్యారు. ఆయనను చాలా కాలం నిర్భంధంలో ఉంచింది ప్రబుత్వం. ఆ సమయంలో కూడ జెలులో నున్న ఖుదీరాం క్షేమసమాచారాలను తెలుసుకోడానికి ఆమె ఎంతో తెగింపుతో ప్రయత్నించారని ఆ యోధురాలి సాహసాన్ని చరిత్రకారుడు ప్రముఖ రచయిత Santimoy Ray, తన గ్రంథం Freedom Movement and Indian Muslims (Page. 34) లో ప్రశంసించాడు.

చివరకు ముజఫర్‌పూర్‌ జైలులో ఖుదీరాంను 1908 ఆగస్టులో ఉరితీశారు. ఉరిశిక్ష విధించిన విషయం తెలుసుకున్న ఆమె ఆ తరువాత ఎదురయ్యే పరిణామాలను ఖాతరు చేయకుండ పోలీసు వర్గాలను విమర్శించారు. అత్యంత కష్టకాలంలో విప్లవకారులకు అండగా నిలచి, కోరి తెచ్చుకున్న కష్టనష్టాలను చిరునవ్వుతో భరించిన ఆ యోధురాలు భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ఖుదీరాంకి దీది గా చిరస్మరణీయమైన ఖ్యాతిని స్థిరపర్చుకున్నారు. 70