పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/72

ఈ పుట ఆమోదించబడ్డది

అగ్ని యుగంలో అపూర్వంగా భాసించిన సాహసి

ఖుదీరాంకి దీది

బ్రిటిష్‌ వలసపాలకుల బానిసత్వం నుండి స్వదేశాన్ని విముక్తం చేసి, స్వరాజ్యాన్ని స్థాపించాలనే ఉత్సాహంతో ఉరకలెత్తే యువతరం ఆయుధాలు చేపట్టి విస్పులింగాలై బ్రిటిషర్ల మీద విరుచుకుపడుతున్న అగ్నియుగం రోజులవి. విప్లవకారుల అణిచివేతకు పలు చట్టాలను అమలులోకి తీసుకురావటమే కాకుండ, విపవోద్యామాన్ని దుంపనాశనం చేయడానికి అన్ని రకాల అధికారాలను ప్రసాదించి పోలీసు అధికారులను ఆంగ్లేయ ప్రబుత్వం ఉసికొల్పింది. విపవకారులకు సహాయపడుతున్నారని ఏ మాత్రం అనుమానం వచ్చినా, ఉద్యమ సానుభూతిపరులను అక్రమంగా నిర్బంధించి, తీవ్రంగా హింసించి అంతం చేస్తున్నభయానక వాతావరణమది.

బ్రిటిష్‌ పోలీసుల దాష్టీకాలను భరించలేక కుటుంబ సభ్యులే విప్లవకారులైన తమ బిడ్డలతో సంబంధాలు వదులుకుంటున్న భయంకర వాతావరణంలో బ్రిటిష్‌ పోలీసులకు ఏమాత్రం భయపడకుండ విప్లవయోధుడు ఖుదీరాంకు అండగా నిలవటమే కాకుండ ఆయనకు ఓ యువతి ఆశ్రయం కల్పించారు. ఆమెను ఆయన దీది (అక్కయ్య) అని పిలిచారు. ఆ కారణంగా ఆమె ఖుదీరాంకి దీది ఆయ్యారు. 69