పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/66

ఈ పుట ఆమోదించబడ్డది

ఝాన్సీ రాణి వెన్నంటి నిలచి ప్రాణాలర్పించిన యోధురాలు

ముందర్‌

(- 1857)

1857 నాటి సంగ్రామంలో మాత్రభూమిని బ్రిటిషు పాలకుల నుండి విముక్తి చేయ డానికి కులమతాలకు అతీతంగా ప్రజలు పోరులో పాల్గొన్నారు. ఆయా ప్రాంతాలలోని స్వదేశీ పాలకుల పక్షాన తిరుగుబాటు చేసిన యోధులు చివరి వరకు తమ ప్రాణాలను పణంగా పెట్టినాయకుల వెంట నడిచారు. చివరకు ప్రాణాలను కూడ తృణప్రాయంగా భావించి త్యజించారు. ఆ విధంగా పోరుబాటలో నడిచి అమరత్వం పొందిన ముస్లిం యువతులలో ఝాన్సీ రాణి లక్ష్మిబాయి నీడలా వెన్నంటి నిలచి శత్రువుతో పోరాడిన ఓ సాహస యువతి కథనం తెలుస్తుంది. ఆమె పేరు ముందర్‌.

ఝాన్సీ రాణి లక్ష్మీమబాయి అమరత్వం పొందిన తీరు గురించి ప్రధానంగా రెండు కథానాలు ఉన్నాయి. ఆ కథానాలలో ఒకి రాణి లక్ష్మీబాయి బ్రిటిషర్ల తుపాకి గుండ్లకు బలైందన్నది. ఈ విషయాన్నిచాలామంది చరిత్రకారులు అంగీకరిస్తున్నారు. ఆ కథనం ప్రకారంగా ఝాన్సీ రాణి లక్ష్మీ బాయికి అంగరక్షకుల్లా ఇరువురు యువతులు మగ వేషాల్లో ఆమెను ఎల్లప్పుడూ వెన్నంటిఉండేవారు. ఆ ఇద్దరిలో ఒకరు ముస్లిం యువతి. ఆమె రాణితో పాటు బ్రిటిష్‌ సైనికాధికారుల తుపాకి గుళ్ళకు బలయ్యారు. అప్పటి 63