పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/62

ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్రోద్యమం:ముస్లిం మహిళలు

గెరిల్లా దాడులతో బ్రిటిష్‌ సైనిక దాళాలను హడలెత్తించిన

"ఆకుపచ్చ దుస్తుల యోధురాలు

భారత స్వాతంత్య్రసంగ్రామ చరిత్రలో ప్రథమ స్వాతంత్య్రపోరాటం మహత్తర ఘట్టం. ఈ పోరాటంలో అసమాన్యులు మాత్రమే కాకుండ సామాన్యులు కూడ ఆయుధాలు చేపట్టి మాతృభూమి రక్షణకు శత్రువుతో పోరాటం చేశారు. ప్రాణాలను అర్పించారు. ఈ అర్పణకు వయస్సుతో నిమిత్తం లేకుండ పోయింది. అందరి లక్ష్యం ఒక్కటే ! పరాయి పాలకుల పెత్తనం నుండి మాతృభూమికి విముక్తి కలిగించటం. అందుకోసం ప్రతిఒక్కరూ కొదమసింగాలై పోరాడారు, సివంగులై గర్జించారు. ఈ మేరకు శత్రువును గడగడలాడిస్తూ పోరాటపదంలో అమరత్వం పొందిన అజ్ఞాత మహిళలు పలువురున్నారు. ఆ కోవకు చెందిన ఆకుపచ్చ దుస్తుల మహిళ గా ఖ్యాతి చెందిన ఓ మహిళ చరిత్రపుటలలో అస్పష్టంగా దర్శనమిస్తారు.

చరిత్రలో ఆమె పేరు ప్రస్తావన లేదు. ఆమె ఆకుపచ్చ దుస్తుల మహిళ గా మిత్రులు-శత్రువులచే గుర్తించబడ్డారు. ఆమె ఎల్లప్పుడు ఆకు పచ్చరంగు దుస్తులు ధారించటంతో ప్రజలతోపాటుగా శత్రువు కూడ ఆ పేరుతో ఆమెను పిలుచుకున్నాడు. ఆమె మగదుస్తులతో కన్పించారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడమని ప్రజలకు పిలుపు నిచ్చారు. ఆమె పిలుపులో ఉన్న ఆకర్షణ ఫలితంగా ప్రజలు అసంఖ్యాకంగా ఆమెను

59