పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/41

ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌


ఆమెను ఇఫ్తికారున్నీసా ఖానం సాహెబా అని కూడ పిలుచుకున్నాడు. ఆ దంపతులకు మీర్జా బిర్జిస్‌ ఖదిర్‌ బహుధూర్‌ అను కుమారుడు కలిగాడు. ఆ తరువాత ఆమె బేగం హజరత్‌ మహాల్‌ అయ్యారు. అవధ్‌ రాజ్యం రాజధాని లక్నో. అది మొగల్‌ రాజ్యంలో ఒక భాగం కాగా, ఆ ప్రభువుల బలాధిక్య త కీణిస్తున్న సమయంలో స్వతంత్య్రరాజ్యంగా ప్రకటితమైంది. 1801లో అవధ్‌ రాజు నవాబు సాదత్‌ అలీ బ్రిీటిష్‌ పాలకులతో సంధి చేసుకుని, అవధ్‌ రాజ్యాన్నిఈస్ట్‌ ఇండియా కంపెనీకి అప్పగించాడు. అవధ్‌ మీద అధికారం కంపెనీ పాలకులది కాగా, నవాబు నామమాత్రమయ్యాడు. ఆ అవధ్‌ రాజ్యానికి చివరి నవాబు అయినటువంటి వాజిద్‌ అలీషా 1847లో సింహాసనం అధిష్టించాడు.

ఆ సంవత్సరం గవర్నర్‌ జనరల్‌గా డల్హౌసీ భారతదశం విచ్చేశాడు. రాజ్యవిస్తరణ కాంక్షతో ఇండియాలోని ఒక్కొక్క రాజ్యాన్ని అక్రమంగా ఆక్రమించుకుంటున్న అతని చూపు సంపన్నవంతమైన అవధ్‌ రాజ్యం మీదా పడింది. ఫలితంగా ఈస్ట్‌ ఇండియా కంపెనీకి చెందిన గవర్నర్‌ జనరల్‌ లక్నోలోని ఒక బ్రిటిష్‌ అధికారి ద్వారా లొంగుబాటు పత్రాన్ని తయారు చేయించి నవాబ్‌ వాజిద్‌ అలీషాకు పంపి, ఆ పత్రం మీద సంతకం చేయమని ఆదేశించాడు. ఆ విధంగా సంతకం చేయనట్లయితే కంపెనీ సేనలు అవధ్‌ రాజ్యంతోపాటుగా అంతఃపురాన్ని కూడ స్వాధీనం చేసుకోగలవన్నాడు. ఆ బెదిరింపులకు భయపడిన నవాబు అవధ్‌ను కంపెనీపరం చేయడనికి సిద్ధపడ్డాడు.

భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో అవధ్‌ పతాకాన్ని వినువీధుా ల్లో ఎగరవసన బేగం హజరత్‌ మహాల్‌ ఆ సమయంలో రంగప్రవేశం చేశారు. ఆ లొంగుబాటు పత్రం మీద సంతకాలు చేయడమంటే అవధ్‌ రాజ్యాన్ని పూర్తిగా ఈస్ట్‌ ఇండియా కంపెనీకి దాసోహం చేయటమేనని భావించిన ఆమె గవర్నర్‌ జనరల్‌ ఆదేశాలను నిరసించారు.ఈ పరిణామాలతో ఆగ్రహంచిన కంపెనీ పాలకులు నవాబ్‌ వాజిద్‌ అలీషాను 1856 ఫిబ్రవరి 13న నిర్బంధంలోకి తీసుకుని, మార్చి 13న కలకత్తా పంపారు. ఆ పరిణామాలకు భయపడిన నవాబు పరివారంలోని అత్యధికులు నవాబుతో పాటుగా కలకత్తా వెళ్ళి పోయారు. బేగం హజరత్‌ మహాల్‌ మరికొందరు మాత్రం, స్వంత గడ్డను పరులపరం చేసి కలకత్తా వెళ్ళటం ఇష్టంలేక లక్నోలోని కౌసర్‌ బాగ్లో ఉండిపోయారు.

ఆంగ్లేయుల ఈ చర్య వలన ప్రజలలో అసంతృప్తి రగులుకుంది. అవధ్‌ చుట్టు

38