పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/294

ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం :ముస్లిం మహిళలు

భారత స్వాతంత్య్రోద్యమం :

శీర్షికపేరుముస్లిం మహిళలు

(ప్రథమ, ద్వితీయ ముద్రణలు)

ప్రముఖుల-పతిక్రల స్పందనలు

'..భారత స్వాతంత్య్ర సాధనలో, అభ్యుదయ పరంపరలో భాగస్వాములైన ముస్లిం వనితల చరిత్రను వెలువరించి, హిందువులమే భాతర స్వాతంత్య్రాన్ని సాధించామని,ముస్లింలకు భాగస్వామ్యం లేదని చాటే మరుగుజ్జులకు చెంపదెబ్బగా ఈ రచన శాశ్వతంగా నిలుస్తుంది...'

- ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు శ్రీ వావిలాల గోపాల కృష్ణయ్య, 12-6-1999

  • '..మీరు ప్రచురించిన భారత స్వాతంత్య్రోద్యమం : ముస్లిం మహిళలు, అనే గ్రంథం ఇటీవల వెలువడిన ఉత్తమ గ్రంథాలలో ఒకటని భావిస్తున్నాము. ఎందుకంటే భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లింలు ప్రత్యేకించి మహిళలు ఎంత వీరోచిత పాత్ర నిర్వహించారో చాలా మందికి తెలియదు . భారత ముస్లింలందరూ స్వాతంత్య్రోద్యమానికి దూరంగా ఉన్నారనీ, వారు స్వాతంత్య్రోద్యమానికి వ్యతిరేకంగా ఉన్నారని, అపవాదు ప్రచారం లో ఉంది. అటువంటి అపవాదును పోగొట్టడానికి

మీ గ్రంథం ఎంతో తోడ్పడగలదు.'

- ప్రముఖ స్వాతంత్య్రసమరయోధులు శ్రీ పరకాల పట్టాభి రామారావు, 27-10-1999

  • '.. చరిత్ర గర్భంలో కలసిపోయిన ముస్లిం మహిళా ఆణిముత్యాల్ని వెలికి తీసి, స్వాతంత్య్రోద్యమంలో వారు చేసిన త్యాగాల్ని, బలిదానాల్ని మీరు వివరించారు.

మీ కృషిని అభినందిస్తున్నాను.'

- ప్రముఖ రచయిత శ్రీ సి.వి. 18-06-1999

  • '..భారత స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న ముస్లిం మహిళల గురించి తెలుగులోవచ్చిన మొదటి పుస్తకం ఇది... ఈ పుస్తకాన్ని తక్కిన భారతీయ భాషల్లోకి, ఆంగ్లంలోకి అనువాదాం చేసి ప్రచురిస్తే భారత సమాజం మరింత సంఘటితం కావడానికి తోడ్పడుతుంది..'

- నడుస్తున్న చరిత్ర, మాసపత్రిక , ఆగస్టు,1999

  • '..భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లిం మహిళలు వెనుకబడలేదని..బేగం హజరత్‌

291