పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/29

ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌

ఎదుర్కొనటం కష్టతరమై న తరుణంలో, తిరిగి దాడి చేసేందుకు తాత్కాలికంగా యుద్ధరంగం నుండివైదొలిగి నేపాల్‌ పర్వతాల్లోకి నిష్క్రమించారు. ఆ అడవుల్లో నానాసాహెబ్‌, మొగల్‌ రాకుమారుడు ఫిరోజ్‌ షా లాింటి యోధులను కలసి బలగాలను మళ్ళీ సమీకరిస్తూ, 1879లో నేపాల్‌ అడవుల్లో సామాన్య మహిళగా కన్నుమూశారు.

ప్రదమ స్వాతంత్య్ర సమరంలో బేగం బాటన నడిచిన మహిళలు పలువురున్నారు. చరిత్ర పుటలు మనకు పలువుర్నిపరిచయం చేస్తాయి. ఆనాటి పోరాటంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి శత్రువును మట్టు పెట్టేందుకు కదనరంగానికి కదలిన వారిలో బేగం అజీజున్‌ ఒకరు. మాతృభూమి పట్ల అపార ప్రేమాభిమానాలు గల ఆమె ప్రభుభక్తి పరాయణురాలు. కాన్పూరు అధినేత నానాసాహెబ్‌ తిరుగుబాటు శంఖారావాన్ని పూరించగానే ఆమె కూడ యుద్ధరంగ ప్రవేశం చేశారు. స్వయంగా శత్రుసైన్యాలను ఎదుర్కొన్నారు. సైనిక పాటాలాలను, గూఢచారి దాళాలను, ఆయుధాలు, ఆహారం అందించే బృందాలను నేర్పుతో ఏర్పాటుచేసి నానాసాహెబ్‌ పోరుకు ఎంతగానో తోడ్పడ్డారు. చివరి వరకు పోరాడుతూ యుద్ధభూమిలో గాయపడి శత్రువు చేత చిక్కారు. శత్రువు క్షమాభిక్ష ప్రకటించినా, తనకు ప్రాణం కంటే మాతృభూమి విముక్తికై సాగుతున్న పోరాటం ప్రధానమని ప్రకటిస్తూ, బ్రిీటిష్‌ తుపాకి గుండ్లకు ఎదురు నిలిచి వీరమరణం పొందారు.

అజీజున్‌ మార్గాన సాగిన మరొకరు 60 సంవత్సరాల అనామిక. ఆమె పేరేమిటో తెలియదు. ఆమె ఎల్లవేళల ధరించే పచ్చరంగు దుస్తుల వలన ఆమె పచ్చరంగు దుస్తుల మహిళగా ఖ్యాతిగాంచారు. గెరిల్లా పోరాటం సాగించిన ఆమె బ్రిటిష్‌ సైనికదాళాలలో భయోత్పాతం సృష్టించారు. గాయపడిన తరువాత గాని పట్టుబడని ఆమెను అంబాలాలో గల బ్రిీటిషు సైనిక స్థావరానికి పంపారు. ఆమెను అంబాల పంపుతూ, ఈ వృద్ధురాలు బహు ప్రమాదకారి...జాగ్రత్త, అంటూ అక్కడి అధికారులను హెచ్చరిస్తూ ప్రత్యేకంగా లేఖ రాసి పంపి, ముందు జాగ్రత్తల గురించి హెచ్చరించారంటే ఆ పచ్చదుస్తుల మహిళ ఎంతి ఘటికురాలో మనం ఊహించవచ్చు.

ఈ విధగా శత్రువును సాయుధంగా ఎదుర్కొన్న మహిళలు, సాయుధ తిరుగుబాటు దాళాలను ప్రోత్సహించినవారు, ఆశ్రయం కల్పించి ఆదుకున్న మహిళలు ఎందరో ఉన్నారు. ఈ కోవలో మాతృదేశ విముక్తి కోసం ఉరిని కూడ లెక్కచేయని సాహసి హబీబా బేగం, ఝాన్శీ రాణి వెన్నంటి నిలచి పోరాడి ప్రాణాలర్పించిన ముందర్‌, బ్రిటిషు సైనిక మూకలను సాయుధంగా ఎదుర్కొన్న ధైర్యశాలి బేగం రహిమా, తిరుగుబాటు యోధుల 26