పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/28

ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం:ముస్లింమహిళలు

పురుషులకు దీటుగా మహిళలు

ఈ సమరోజ్వల చరిత్రలో ముస్లిం మహిళలు కూడ పురుషులతో దీటుగా తమదైన వీరోచిత పాత్ర నిర్వహించారు. ఆ త్యాగాలు కూడ పలు కారణాల మూలంగా మరుగున పడిపోయాయి. మతపరమైన ఆచార సంప్రదాయాలు ముస్లిం మహిళలను గడప దాటనివ్వవన్నఅపోహల మూలంగా ముస్లిం మహిళల త్యాగమయ చరిత్ర వైపు దృష్టి సారించటమే గగనమైపోయింది. చరిత్రకారుల అంవేషణకు స్వాతంత్య్రోద్యమంలో ముస్లిం మహిళల పాత్ర వస్తువు కాలేకపోయింది. ఆ కారణంగా విముక్తి పోరాటంలో ముస్లిం మహిళల అరుదైన పాత్ర చరిత్ర పుటలలో బందీగా మిగిలిపోయింది.

మాతృభూమిస్వేచ్ఛాస్వాతంత్య్రాల కోసం ముస్లిం మహిళలు ఆత్మబలిదానానికి సిద్ధపడిన దాృష్టాంతరాలున్నాయి. విముక్తి పోరాట మైధానంలో శత్రువును సవాల్‌ చేసిన వీర వనితల చరిత్రలున్నాయి. సాహసోపేత సంఘటనలున్నాయి. ఆ సంఘటనలన్ని చరిత్ర అట్టడుగు పొరల నుండి బయటపడలేక పోయాయి.

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో...

ప్రదమ స్వాతంత్రసమరంలో ప్రదాన పాత్ర వహించిన ముస్లిం సమాజానికి చెందిన స్త్రీలు తమ అపూర్వత్యాగాలతో, ఆత్మార్పణలతో చరిత్ర పుటలను ఎరుపెక్కించారు. అటువింటి వారిలో ప్రముఖులు అవధ్‌రాణి బేగం హజరత్‌ మహాల్‌. బ్రిీటిష్‌ పాలకులు కుయుక్తులతో ఆమె భర్త నవాబ్‌ వాజిద్‌ అలీషాను అరెస్టు చేసి అవధ్‌ను స్వాధీనం చేసుకున్నారు. మాతృభూమి పరుల పాలవడంతో ఆగ్రహించిన ఆమె ప్రజల అండదండలతో బ్రిీటిష్‌ సైన్యంపై విరుచుకుపడి తిరిగి తన రాజ్యాన్ని సొంతం చేసుకున్నారు. పదమూడు సంవత్సరాల తన బిడ్డడు బిర్జిస్‌ ఖదీర్‌ను నవాబుగా ప్రకటించి అతని సంరక్షకు రాలిగా బాధ్యతలు చేపట్టారు . స్వదేశీ పాలకులను, ప్రముఖులను ప్రజలను ఐక్యపర్చారు. పరిపాలనలో హిందూ-ముస్లింలకు సమాన స్థాయి కల్పించారు. బ్రిీటిష్‌ సైనికదాళాల పడగ నీడలో కూడ ఎంతో సాహసంతో 14 మాసాల పాటు బ్రిీటిష్‌ వలస పాలకుల ఎత్తులను చిత్తుచేస్తూ, సమర్థ్ధవంతమైన పాలన సాగించారు. బేగంపై కత్తి గట్టిన బ్రిీటిష్‌ పాలకులు అవధ్‌ను అపార సైనిక బలగాలతో ముట్టడించినా, ఏమాత్రం అధైర్యపడక ఆమె స్వయంగా రణరంగ ప్రవేశం చేసి, తన సైనిక దాళాలను ముందుకు నడిపి వీరోచితంగా పోరాడారు. భారీ సంఖ్యతో చుట్టుమ్టుిన బ్రిీటిష్‌ సైనికమూకలను 25