పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/279

ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


బయలుదేరిన ఆక్రమణదారులు శ్రీనగర్‌ నుండి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్నారు. వాళ్ళు ఇస్లాం నినాదం చేస్తున్నారు. మీరు నావెంట ఉంటారో వారితో కలుస్తారో తేల్చుకోవాల్సింది మీరే.. నాతో ఉండాలనుకుంటే మనం హిందూ, ముస్లిం, శిక్కులంతా కలసి ఆన్నదమ్ముల్లా జీవించాలన్న సూత్రానికి బద్ధులై ఉండాలి. ఈ విధానం ఓ 'కాఫిర్‌'దిగా మీరు భావిస్తే, మీరు మీ ఆయుధాలను ముందుగా నామీద ప్రయోగించండి. మీరు 'కాఫిర్‌'ల మీద దాడులు, అత్యాచారాలకు పాల్పడదలిస్తే దానిని నా కుటుంబం నుండి ఆరంభించండి అని అన్నారు.

('..Today the raiders from Pakistan are a few miles from Srinagar. Tehy are raising the slogan of Islam. It is open to you to be with them or tobe with me...If you opt to be with me you must know that you have to live for all times on the principle that Hindus, Muslims and Sikhs are brothers. If that is the language of a Kafir you should raise your sword first against me. If you want to raid or rape ' Kafirs ' I am the first Kafirand you must start it from my place and my family. ' - Encyclopaedia ofMuslim Biography, Page. 174)

ఆ తరువాతి కాలంలో వివాదాస్పద నిర్ణయాలు, ప్రకటనల మూలంగా డాక్టర్‌ అబ్దుల్లా అరెస్టులకు, జైలు శిక్షలకు గురవుతూ వస్తున్నసందర్భంగా బేగం అక్బర్‌ జెహాన్‌ అటు పార్టీ శ్రేణులను కాపాడుకుంటూ ఇటు కుటుంబీకుల పట్ల ఉన్నబాధ్యతలను సక్రమంగా నెరవేర్చుతూ అబ్దుల్లా గైర్హాజరిని వారి అనుభవంలోకి రానివ్వకుండ చూడటంలో ప్రధాన పాత్ర వహించారు. జమ్మూ-కశ్మీర్‌లో ఏర్పడిన రాజకీయశూన్యత నుండి కార్యకర్తలను కాపాడుకుంటూ వారిలో ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్నినింపారు. కశ్మీరు లోయలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండ ఆమె ఎంతగానో సహాయపడ్డారు.

( '..filled in the vacum and helped in maintaining peace in the vally and unity in the ranks of his followers. ' Encyclopaedia of Muslim Biography, Page. 173)

1947-48 నాటి భయానక పరిస్థితుల నుండి జమ్మూ-కాశ్మీర్‌ను కాశ్మీర్‌ ప్రజలను కాపాడేందుకు డాక్టర్‌ అబ్దుల్లా దంపతులు ముందుకు వచ్చారు. పాక్‌ ఆక్రమణదారులు కశ్మీరు ప్రజల మీద సాగిసున్న దాడులను ఖండించారు. ఆ దాడులలో గాయపడిన వారిని, ఆస్థిపాస్తులను కొల్పోయి నిరాశ్రయులై ప్రజలను ఆదుకునేందుకు

276