పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/277

ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


1946 ప్రాంతంలో భారత దేశానికి బ్రిటీష్‌ ప్రభుత్వం పంపిన క్యాబినెట్ మిషన్‌ ఫెడరల్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియాను ప్రతిపాదించింది. ఇండియా నుండి బ్రిటీషర్లు వైదొలిగాక సంస్థానాధీశుల స్థానంలో ప్రజల ప్రభుత్వం ఏర్పడాలని డాక్టర్‌ అబ్దుల్లా ఆశించారు. ఈ మేరకు ప్రజలను చైతన్యవంతుల్ని చేయడానికి ఆయన ఉపక్రమించగా ఆయనతోపాటుగా బేగం అక్బర్‌ జెహాన్‌ ఉద్యమించారు. ఈ ఉద్యమాన్ని ఆ దంపతులు కశ్మీర్‌ సంస్థానం వరకు పరిమితం చేయలేదు. ఆనాడు ఇండియాలోని సుమారు 600 సంస్థానాలలోని ప్రజలను ఈ విషయమై చైతన్యపర్చేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు డాక్టర్‌ అబ్దుల్లా క్యాబినెట్ మిషన్‌కు మహజరు కూడ సమర్పించారు. బ్రిటీషు ప్రభుత్వం అధికారంలో నుండి వైదొలిగాక ప్రభుత్వాధికారాన్ని ప్రజల పరం చేయాలని, సార్వభౌమత్వం ప్రజల చేతుల్లో ఉండాలని ఆ మహజరు కోరింది. ఆ నేపథ్యంలో క్విట్ కశ్మీర్‌ ఉద్యమానికి డాక్టర్‌ అబ్దుల్లా శ్రీకారం చుట్టారు. ఉద్యమం ఉదృతంగా సాగింది. అరెస్టుల పరంపరలో భాగంగా 1946 మే మాసంలో బేగం అక్బర్‌ జెహాన్‌ భర్త అబ్దుల్లాను ప్రభుత్వం అరెస్టు చేసింది. రాజద్రోహానికి పాల్పడ్డారన్న ఆరోపణల మీదా తొమ్మిది సంవత్సరాల జైలు శిక్షను విధించింది. ఆ సమయంలో బేగం అక్బర్‌ జెహాన్‌ రంగంలోకి దిగారు. అంతవరకు పరోక్షంగా భర్త అబ్దుల్లాకు సహాయకారిగా ఉన్న ఆమె ప్రత్యక్షరాజకీయాలలోకి ప్రవేశించారు. ఆమె స్వయంగా గ్రామాలకు గ్రామాలు పర్యటిస్తూ ప్రజలను కూడగట్టారు. బాధితులను ఆదుకున్నారు. ప్రజలలో భయాలను తొలగించి ఆశాజ్యోతులను వెలిగించారు. క్విట్ కాశ్మీర్‌ ఉద్యమానికి ప్రజల మద్ధతు సాధించేందుకు ఆమె నడుం కట్టారు . జనసమూహాలను ప్రబావితం చేయగల విధగా చర్యలు తీసుకున్నారు. ఆ కారణంగా క్విట్ కశ్మీర్‌ ఉద్యమానికి ప్రజల నుంచి మంచి మద్దతు లభించింది. కశ్మీర్‌ ఉద్యమం సందర్భంగా ప్రజలను సమీకరించగల శక్తియుక్తులు, ఆమెలో నిబిఢుకృతమై ఉన్న శక్తి సామర్థ్యాలు బహిర్గత మయ్యాయి. డాక్టర్‌ అబ్దుల్లా జైలులో ఉన్న సమయంలో కశ్మీర్‌ వచ్చిన మహాత్మా గాంధీని ఆమె స్వయంగా కలుసుకుని చర్చించారు. (‘ Her ability to mobilize people came to the fore during ‘ Quit Kashmir ‘ movement and subsequently when her husband was in prison in 1946-47 as she came out of the confines of home and visited villages of the state and burn the ‘ lamp of hope ‘ for the oppressed people.’ - The Legend Makers Some Eminent

274