పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/268

ఈ పుట ఆమోదించబడ్డది

భారత దేశంలో తొలి మహిళా మంత్రిగా చరిత్ర సృష్టించిన

మాసుమా బేగం

(1902-1990)


జాతీయోద్యమంలో భాగస్వాములవటంతో పాటు స్వతంత్ర భారత ప్రభుత్వంలో కూడ బాధ్యతలు నిర్వహించగల అవకాశాలు దక్కించుకొన్న స్వాతంత్య్రసమరయోధులు కొద్దిమంది మాత్రమే . ఆ అరుదైన అవకాశంతో పాటుగా పదవులు పొందిన పదిమందిలో ప్రథమంగా నిలచి చరిత్ర సృష్టించుకున్న భాగ్యాన్ని దక్కించుకున్న వారు అతికొద్దిమంది. ఆ ఆతికొద్దిమంది అదృష్టవంతుల్లో ఒకరు మాసుమా బేగం. ఆంధ్రప్రదేశ్‌ తొలి మంత్రి వర్గంలో తొలి మహిళా మంత్రి, తొలి ముస్లిం మంత్రి, మొత్తం భారత దేశంలోనే మంత్రిపదవిని నిర్వహించిన తొలి ముస్లిం మహిళ మాసుమా బేగం 1902లో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హైదారాబాద్‌లో జన్మించారు. తల్లి పేరు తయ్యిబా బేగం(Tayyiba Begum). తల్లి మంచి విద్యావంతురాలు. అమె భారత దేశంలోనే తొలి ముస్లిం పట్టభధ్రురాలు. తండ్రి పేరు ఖదీవ్‌ జంగ్‌.(Khedv Jung) తాత సయ్యద్‌ హుస్సేన్‌ బిల్‌గ్రామి(Syyid Husain Bilgrami). ఆచార, సంప్రదాయ కుటుంబంలో పుట్టిన మాసుమా బేగం, ఆమె చెళ్ళెల్లు హైదారాబాద్‌ లోని మహబూబియా బాలికల పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. ఆమె

265

265