పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/267

ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


అనిస్‌ బేగం ఓ నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయానికి అనుగుణంగా శరణార్థులుగా మారిన హిందూ-శిక్కు భాధిత మహిళలలకు, పిల్లలకు రక్షణ కల్పించి ఆశ్రయమిచ్చి ఆదుకునేందుకు కృషిచేయాల్సిందిగా మహాత్మాగాంధీ ఆదేశించారు. ఆయన ఆదేశాలను శిరోధార్యంగా భావించి సుభద్రా జోషి, మృదులా శారాబాయిలతో కలసి అనిస్‌ బేగం రంగంలోకి దిగారు.

విభజన సృష్టించిన సంక్షోభం వలన విలవిల్లాడుతున్న వేలాది మహిళలను చేరదీశారు. ఆ బాధిత మహిళలకు ధైర్యం చెప్పి శరణార్థుల శిబిరంలో ఆశ్రయం కల్పించారు. తల్లి తండ్రులను కొల్పోయిన యువతులు, భర్తలను పోగొట్టుకున్న మహిళలు, కిడ్నాప్‌, అత్యాచారాలకు బలైన ఆడపడుచుల సమాచారాన్ని సేకరించటం వారి కోసం అన్వేషణ సాగించటం, దొరికిన వారిని వారివారి బంధువుల వద్దకు చేర్చటం, లేనివారిని శరణార్థి శిబిరాలకు పంపించే కార్యక్రమాలలో అనిస్‌ బేగం అవిశ్రాంతగా శ్రమించారు.

ఈ కార్యక్రమాలలో భాగంగా ఆమె లక్నోలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో అవసరార్థులను, అభాగ్యులను చేర్చుకుని వారి వారి స్థానాలకు వారు భద్రంగా చేరేంత వరకు వారికి ఆశ్రయం,రక్షణ కల్పించారు. మతోన్మాద రాక్షసి బారిన పడి భయవిహ్వలులైన మహిళలకు ధైర్యం చెబుతూ వారిలో ఆత్మస్థై ర్యం పెంపొందించేందుకు కృషి సల్పారు. శరణార్ధుల పట్ల చూపుతున్న ప్రేమాభిమానాల వలన బాధితులకు ఆమె అనిస్‌ ఆపా (అనిస్‌ అక్కయ్య) అయ్యారు.

ఈ మేరకు ఆమె అందించిన సేవలకు గుర్తింపుగా అమెను రాజ్యసభకు ఎంపికయ్యారు. రాజ్యసభ సభ్యురాలుగా 1957 నుండి 1968 వరకు బాధ్యతలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల సంక్షేమం కోసం పలు సూచనలు చేశారు. ఆ దిశగా సంఘాలు, సంస్థలకు క్రియాశీలక సహకారమందించారు.

భారత విభజన అనుభవాలను Azadi Ki Chaon Mein పేరుతో అక్షరబద్దాం చేశారు. మతోన్మాదం సాగించిన రాక్షసత్వాన్ని వివరిస్తూ ఎతిజితిళీ పేరుతో మరో గ్రంథాన్ని జులీ అరిదీదిలి ఈలిదినీదీలి అను మరో పుస్తకాన్ని కూడ ఆమె రాశారు. ఆమె రాసిన వ్యాసాలు 1976లో శ్రీబిచిజీలి చనీతిరీనీ స్త్రతిచిజీలి శీర్షికతో ప్రచురితమయ్యాయి. ఆమె సాహిత్య కృషికి ప్రతిఫలంగా సాహిత్య ఆకాడమీ ఆవార్డు కూడ లభించింది.

ఈ మేరకు రాజకీయం, సాహిత్యం,సేవా రంగాలలో అపూర్వసేవలందించి మాతృభూమి రుణం తీర్చుకునేందుకు అవిశ్రాంతంగా శ్రమించిన అనిస్‌ బేగం కిద్వాయ్‌ 1982 లై 16న కన్నుమూశారు.

264