పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/262

ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం :ముస్లిం మహిళలు


రాత్రి బడులు, గ్రంథాలయాలు ఏర్పాటు, ప్రగతిశీల సాహిత్యం చదివించటం, ఆయాఅంశాల మీదా చర్చలు జరపటం ఈ కేంద్రాలలో జరిగేది. ఈ కేంద్రాలకు ప్రమీలా తాయి లాంటి ప్రముఖులు విచ్చేశారు. ప్రముఖ కమ్యూనిస్టు నేతలు రజియా బేగం కుటుంబంలోని మహిళలు పలు మహిళా కేంద్రాలను ప్రారంభింప చేసి ఆ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఆ కార్యక్రమాలలో భాగంగా కలకత్తా, ఢిల్లీ లాంటి ప్రాంతాలతో జరుగు అఖిల భారత మహిళా సంఘాల సమావేశాలలో ఆమె పాల్గొంటూ మహిళా ఉద్యామాలకు చేయూతనిచ్చారు.

చినన్నప్పటి నుండి రచనా వ్యాసాంగం మీదా అధిక ఆసక్తి చూపిన రజియా బేగం 1944 ఎం.ఏ చేసి వుమెన్స్‌ కాలేజిలో లెక్చరర్‌ అయ్యారు. ఆ తరువాత 1966లో యూర్సిటి ఆర్ట్స్ కాలేజిలో చేరారు. పర్షియ న్‌లో పి.హెచ్‌.డి ఇరాన్‌లో చేశారు. సరోజిని నాయుడు కుమార్తె లీలామణి నాయుడుతో కలసి కాలేజీలో సాహిత్య గోష్టులు జరుపుతూ ఔత్సాహిక కవులకు-రచయితలకు తోడ్పటు అందించారు. తెలంగాణ సాయుధా పోరాట కార్యక్రమాల తరువాత రజియాకు రాజకీయాల పట్ల అసక్తి తగ్గుముఖం ప్టింది. ఆసమయంలో ఆమె తండ్రి రిటైర్‌ కావడంవల్ల, మిగతా వాళ్ళంతా పార్టీలో పని చేస్తుండటం వల్ల ఆమె కుటుంబ భారాన్ని మోయాల్సి వచ్చింది. ఆర్థికంగా స్థిరపడి కుటుంబ భారాన్ని మోసున్నప్పటి పురుషులతో సమానమన్పించకపోవటంతో ఆమె ఆవేదనకు గురయ్యారు. ఈ విషయాన్ని మరింత విస్తారంగా వివరించారు.

ఇంట్లో అంతా తోడ్పడేవాళ్ళు. పురుషులు కూడ కొంత పనిచేసేవాళ్ళు. పిల్లలుకూడ కొంత చేసేవాళ్ళు. అయినప్పికీ కొంత మన బాధ్యా తే అన్పిసుంది. కొన్ని కారణాలుపరిశీలించాలి. స్త్రీగా వుండటమనేది ఒకటి. యుగాల నుంచి వస్తున్న సాంఫిుక వ్యవస్థఆమెను తక్కువ స్థాయిలో వుంచింది. ఆర్థిక స్వాతంత్య్రం వున్నప్పటికీ, స్త్రీ పురుషుని కంటే తక్కువగానే భావిస్తుంది. అతని మీదే ఆధారపడుతుంది. స్త్రీ ఒంటరిగా ఉండటంమనేటటువంటి భయం ఘోరమైంది, ప్రపంచమంతా వుంది. ఆమె తను ఒంటరిగా బయటకెళ్ళడనికి భయపడతారు, పురుషులెతే ఒంటరిగా వెళతాడు, ఎవరూ బాధించరు . పురుషుడికి స్వేచ్ఛవుంది. స్త్రీలను ఏ విధాంగా చూస్తారనే దాని గురించి పుస్తకాలు రాస్తున్నారు. ఈ బంధాలెలా తెంచుకుంటామనేది చూడలి. సిండరెల్లా అనే చక్కని పుస్తకంలో, స్రీకి ఆర్థిక స్వాతంత్య్రం ఉన్నప్పటికి ఇంకా విముక్తి పొందకుండ వుండటమనే


259