పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/247

ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


నుంచి వేరొకచోటుకి తీసుకెళ్ళాం. రాజ్‌ మమ్మల్నిఅండర్‌ గ్రౌండ్‌ వెళ్ళిపొమ్మన్నాడు. అఖ్తర్‌ మధ్యలో ఒకసారిపెరోల్‌ మీద వచ్చి వెళ్ళిపోయాడు.

1948లో నా భర్త చనిపోయాడు. నేను తెలుగు నేర్చుకోవడం ప్రారంభించాను. పార్టీ కోరకు డబ్బువసూలు చేయటం మొదలుపెట్టాను. తాయి (ప్రమీలా తాయి) యశోధాబెన్‌, బ్రిజ్‌రాణి అంతా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ మీద నిషేధం వచ్చిన తర్వాత అంతా ఇక్కడికి రావడం ప్రారంభించారు. అభ్యుదయ రచయితల సమావేశాలు కూడ జరిగేవి.

కమ్యూనిస్టు పార్టీలో విభేదాలు ఎక్కువైపోయాయి. ఆర్‌.యన్‌(రావి నారాయణ రెడ్డి) బొంబాయి వెళ్ళాడు. తర్వాత అఖ్తర్‌, గోపాలన్‌( ఎ.కే.గోపాలన్‌), జ్యోతిబసు, ముజఫర్‌ అహమ్మద్‌తో ఏర్పడిన డెలిగేషన్‌ ఒకటి వచ్చి-1951లో సాయుధ పోరాటం కొనసాగించాలా విరమించాలా అనే విషయం చర్చించడానికి వచ్చారు. మా ఇంటి ముందున్న యింట్లో వాళ్ళు ఉండడానికి ఏర్పాటు చేశాము. మా నాన్న సహాయం చేశాడు. చాలా రాత్రి వరకు మీటింగులు, చర్చలు జరిగేవి. అని ఆనాటి విషయాలను జమాలున్నీసా వివరించారు.

ఈ విధంగా పోరాట కార్యక్రమాలలో పాల్గొన్న జమాలున్నీసా బాజి కమ్యూనిస్టు పార్టీ పోరాటాన్ని విరమించుకున్న తరువాత కూడ పార్టీపరంగా ప్రజలలో పనిచేయటం ఆరంభించారు. ప్రధానంగా మహిళలలో ఆమె ఎక్కువగా పని ప్రారంభించారు. ఆ విశేషాలను ప్రస్తావిస్తూ, పోరాటం విరమించుకున్న తర్వాత, మహిళా సంఘాలు ప్రారంభించాం. కామ్రెడ్‌ ఘనీ అసిఫ్‌నగర్‌లో అతని భార్యతో ఒక మహిళా సంఘం పెట్టాడు. పర్దావేసుకునే స్త్రీలు ఒక సెంటర్‌ నుంచి ఇంకో సెంటర్‌ వెళ్ళేవారుకారు. ఆఘాపురాలో ఒక రాత్రి బడి, మాస్క్‌ దగ్గర ఇంకో సెంటర్‌ పెట్టారు. కథలు, గోర్కీ రచనలు చదివేవాళ్ళం. చాలా రోజులు అలా చేశాం. కొంతమంది అమ్మాయిలు పార్టీ సభ్యురాళ్ళయ్యారు. ఎన్నికల్లో పనిచేశారు. నాతో కలసి గుంటూరు, విజయవాడకు వచ్చారు. ఇప్పుడు వాళ్ళంతా పెళ్ళిల్లు చేసుకుని, ఏమీ చేయటం లేదని ఆమె పేర్కొన్నారు.

కమ్యూనిస్టు పార్టీకార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్న పలువురు పార్టీ కార్యక్రమాల నుండి క్రమంగా దూరమైనప్పటికి జమాలున్నీసా మాత్రం తన ప్రజాచైతన్య కార్యక్రమాలలో కొనసాగారు. ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు మగ్దూం మొహిద్దీన్‌ మార్గదార్శకత్వంలో ఆమె తన కార్యకలాపాలను సాగించారు. ఆ వివరాలను ఆమె ఈ

244