పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/245

ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌

కర్మకాండల గురించి చర్చించి, హేతుబద్దం కాని అనాచార సంప్రదాయాలను తిరస్కరించాల్సిందిగా ప్రజలను కోరారు. ఆ కాలంలో అమలులో ఉన్న పర్దా పద్దతిని తిరస్కరించారు. ఆ తిరస్కారం స్వజనుల ఆగ్రహానికి కారణమైనప్పికి జమాలున్నీసా లెక్కచేయలేదు. ఆగ్రహించిన సన్నిహితులకు విషయాన్ని తర్కబద్దంగా వివరించి నచ్చ చెప్ప ప్రయత్నించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల నైతిక మద్దతు వలన తన అభిప్రాయాల మీద జమాలున్నీసా బాజి చివరివరకు సుదాఢంగా నిలిచారు.

జాతీయోద్యమ కార్యక్రమాలలో తనదైన పాత్ర నిర్వహిస్తూ వచ్చిన జమాలున్నీసా క్రమక్రమంగా కమ్యూనిస్టు ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యారు. కమ్యూనిజం ప్రబావానికి ఆమె ఒక్కతే లోనుకాలేదు. ఆమె సోదరులు అన్వర్, జఫర్‌, సోదరి రజియా బేగం కూడ ప్రభావితులయ్యారు. కమ్యూనిజం సాహిత్యాన్ని పఠిస్తూ సిద్ధాంత పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ ప్రజలలో కలసి పనిచేయటం ఆరంభించారు. అన్ని రంగాలలో సమానత్వం సాధించటం, సమసమాజ స్థాపన అను మహత్తర లక్ష్యాలను సాధించేందుకు కమ్యూనిజం ద్వారా మాత్రమే సాధ్యమని నమ్మిన జమాలున్నీసా బాజి కుటుంబ సభ్యులు ఆ దిశగా ఎంతో నిబద్దతతో ముందుకు సాగారు. ఆ లక్ష్యసాధనకు తమ ప్రాణాలు బలిపెట్టడానికి కూడ ఆమె అన్నదామ్ములు జఫర్‌, అన్వర్లు సిద్దమయ్యారు. ఆ సోదరులకు మద్దతుగా జమాలున్నీసా బాజి అమె చెల్లెలు రజియా బేగం, ఇతర కుటుంబ సభ్యులు కూడ కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాల ప్రచారానికి తోడ్పడ్డారు. ఆనాడు కమ్యూనిస్టు పార్టీ మీద పలు ఆంక్షలు, నిషేధాలు ఆమలులో ఉన్నప్పటికి పోలీసుల, గూఢచారుల కంటపడకుండా తమ ఇంటిని రహాస్య కేంద్రంగా చేసు కుని జమాలున్నీసా ఎంతో ధైర్యంతో పార్టీ కార్యకలాపాలను నిర్వహించారు.

జమాలున్నీసా కుటుంబం వామపక్షబావాల వైపు గా సాగించిన ప్రస్తానం గురించి స్వయంగా ఆమె ఈ విధంగా వెల్లడించారు. ఆ కథనం ప్రకారం, మొదట్నించీ మేము వామ పక్షానికి దగ్గరగా వుండేవాళ్ళం. 1941లో అభ్యుదయ రచయితల సంఘం అని ఒకి వుండేది. మఖ్దూం, నజర్‌ హైదారాబాద్‌ ఎప్పుడూ వస్తూండేవారు. మేం నలుగురు అక్క చెల్లెళ్ళం. ఈ మీటింగులకి బహిరంగంగా వెళ్ళేవాళ్ళం. అమ్మకూడ వచ్చేది. కొంతమంది చిల్‌మన్ల (చాటుకోసం చేసిన ఏర్పాటు) వెనుక కూర్చునేవాళ్ళు....సజ్దాద్‌ జహీర్‌, ఓంకార్‌, పర్షాద్‌ లాంటివాళ్ళు చాలా మంది అండగ్రౌండ్‌లో వున్నప్పుడు మా

242