పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/236

ఈ పుట ఆమోదించబడ్డది

జనచైతన్య కార్యక్రమాల నిర్వహణలో దిట్ట

ఫాతిమా బేగం

భారత స్వాతంత్రోద్యమంలో మహిళలు తమ సహజ పరిమితులకు మించిన భాగస్వామ్యాన్ని అందించారు. బ్రిటీష్‌ ప్రభు త్వానికి వ్యతిరేకంగా ప్రత్యక్ష్య కార్యకలాపాలలో పాల్గొని కొందరు పోరాటరంగాన అగ్రభాగాన నిలిస్తే మరికొందరు పరోక్షంగా జాతీయోద్యమానికి క్రియాశీలక తోడ్పటు నిచ్చారు. ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొన్న మహిళల వివరాలు కొంతలో కొంతగానైనా అందుబాటులో ఉన్నాయి. ఎందువల్లనంటే ప్రబుత్వాలు, తమను ఎదిరిస్తున్న ప్రతి ఒక్కరి వివరాలను సేకరించి, వ్యక్తిగత రికార్డులను ద్రాపరుస్తాయి. ఉద్యమాలకు, ఉద్యామకారులకు పరోక్షంగా తోడ్పట నందించిన వారి గురించి రికార్డుల పరంగా సమాచారం లభించే అవకాశాలు అంతగా ఉండవు. అటువంటి వ్యక్తులు ఎంత త్యాగమయ సేవలను అందించినా, గొప్ప బాధ్యతలు నిర్వర్తించినా ఆయా వివరాలు గుప్తంగానే ఉండిపోతాయి. ఈ విధంగా పరోక్షంగా జాతీయోద్యమానికి ఎనలేని తోడ్పాటు అందచేసిన మహిళ శ్రీమతి ఫాతిమా బేగం.

బేగం ఫాతిమా పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన స్వాతంత్య్ర సమరయాధురాలు. ఆమె జాతీయ కాంగ్రెస్‌ పంజాబ్‌ రాష్ట్ర శాఖ సభ్యురాలు. జాతీయోద్యమ లక్ష్యాలను ప్రజలకు వివరించి ఉద్యమ కార్యక్రమాల వైపు వారిని ఆకర్షించి ఉద్యమంలో చురుకుగా

33