పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/232

ఈ పుట ఆమోదించబడ్డది

జమిందారీ దాష్టీకాన్ని సాయుధంగా ఎదుర్కొన్న

భక్తావర్‌ మాయి

(-1946)

భారతీయ ముస్లిం మహిళలు జాతీయోద్యమంలో పాల్గొనటమే కాకుండ, బ్రిటీష్‌ ప్రభుత్వ వత్తాసుదారులుగా మారి ప్రజలను హింసిస్తున్న ప్రజాకంటకులను ధైర్య సాహసాలతో ఎదాుర్కొన్న సంఘటనలు కూడ చరిత్రలో దర్శనమిస్తాయి. జమీందారీ దాష్టీకాలను ప్రతిఘటించే క్రమంలో గ్రామ ప్రజలను ఆదుకునేందుకు ఆయుధ ఎత్తుకుని చరిత్రకెక్కిన మహిళలలో శ్రీమతి భక్తావర్‌ మాయి ఒకరు.

భక్తావర్‌ మాయి వాయువ్యసరిహద్దు రాష్ట్రం (ప్రస్తుతం పాకిస్థాన్‌ భూభాగం) లోని సింథ్‌ ప్రాంతం లాషారి గ్రామానికి చెందిన ఆడపడుచు. ఆమె భర్త వలి ముహమ్మద్‌ లాషారి. అతను సామాన్య రైతు. ఆ ప్రాంతపు జమీందారు పరమ క్రూరుడు. బ్రిటిషర్ల తొత్తు. ఆతడు రైతుల శ్రమను దోచుకుంటూ విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డాడు . ఈ విషయమై ఎవ్వరైనా జమిందారునిగాని, అతని వత్తాసుదారులను గాని ప్రశ్నిస్తే అంతటితో వారికి నూకలు చెల్లినట్టే.

అది 1946 నాటి సంఘటన. భారతదేశం పరాయిపాలకుల పాలనలో ఉంది. ఆ పాలకవర్గాల తాబేదారులైన జమీందారుల రాజ్యం గ్రామాలలో సాగుతూనే ఉంది. లాషారి గ్రామ రైతులు ఆరుగాలాలు శ్రమపడి పండించుకున్న పంటను ఇళ్ళకు తెచ్చుకుని

229