పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/215

ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌

శ్రమించారు. వికలాంగుల సేవా కేంద్రాల స్థాపనను ప్రోత్సహించారు.

ఈ మేరకు అటు పోలియో మీద అవిశ్రాంత పోరాటం చేస్తూఇటు సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా తిరుగులేని యుద్ధం ప్రకించిన ఫాతిమా ఇస్మాయిల్‌ ఆచరణాత్మక సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1957లో పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. దళిత ప్రజల మీదా కొనసాగుతున్న సామాజిక వివక్షతకు వ్యతిరేకంగా పోరాడుతూ దళిత జనావళి అభ్యున్నతి కోసం ఆమె సాగించిన కృషి గమనించిన దళిత ప్రజలు స్వయంగా 1972లో దళితమిత్ర అవార్డుతో ఆమెను సత్కరించుకున్నారు. ఈ విధగా స్వదేశంలోనే కాకుండ విదేశాలలో కూడ ఆమెకు గౌరవసత్కారాలు లభించాయి. పలు అవార్డులు ఆమె సొంతమయ్యాయి. ఆ విధాంగా లభించిన పురస్కారాలన్నింటిని ఆమె మార్గదర్శకత్వంలో సాగుతున్న సేవాసంస్థల ఆర్థిక పరిపుష్టికి వినియోగించారు.

ప్రజాసేవారంగాలలో జాతీయ స్థాయిలోనే కాకుండ అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొంది, స్వాతంత్య్ర సమరోద్యమకారిణిగా, పోలియో నియంత్రణకు అవిరళ కృషి సల్పిన యోధురాలిగా, భారతీయుల ప్రియతమ సంఘసేవకురాలిగా, ఖ్యాతిగాంచిన ఫాతిమా ఇస్మాయిల్‌ 1979 లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ పదవిలో 1985 వరకు పనిచేశారు. రాజ్యసభ సభ్యురాలిగా కూడ ఆమె సంఘ సేవా కార్యక్రమాలను విస్తృతంగా కొనసాగించారు. ఈ విధంగా జీవిత చరమాంకం వరకు ప్రజాసేవలో గడిపిన శ్రీమతి ఫాతిమా ఇస్మాయిల్‌ 1987 అక్టోబర్‌ 11న కన్నుమూశారు.

♦♦♦♦♦

నా భర్త అరెస్టు వలన బెంగాల్‌ ఖిలాఫత్‌ కమిటీ కార్యక్రమాల నిర్వహణలో ఏర్పడిన ఖాళీని నా కృషితో భర్తీ చేస్తాను. ఆయన ఇక్కడుంటే జరిగే పనులన్నీ యధాతథంగా జరుగుతాయని తెలుపుకుంటున్నాను. గతంలో నా భర్త నిర్బంధంలో ఉన్నప్పుడు నా శక్తి మేరకు ఆయన బాధ్యతలను నేను నిర్వర్తించాను. గత ఐదు సంవత్సరాల నుండి నా ఆరోగ్యం బాగాలేదు. మానసికంగా బలహీనంగా ఉన్నాను.నా ఆనారోగ్యం దృష్ట్యా నా విధిని నేను నిర్వహించేందుకు మౌలానా అనుమతించేవారు కారు. అయినప్పటికి ఈ నశ్వరమైన శరీరాన్ని ఖిలాఫత్‌ ఉద్యమానికి సంపూర్ణంగా అంకితం చేయాలని నిర్ణయించుకున్నాను. -బేగం జులేఖా అబుల్‌ కలాం ఆజాద్‌.

212