పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/211

ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


మహాత్మాగాంధీ తిలక్‌ ఫండ్‌ కోసం ముహమ్మద్‌ ఉమర్‌ సోహాని వద్దకు రాగా తన చెక్కుబుక్‌ను ఆయకిచ్చి ఇష్టమొచ్చినంత రాసుకోమన్నారు. గాంధీజీ లక్ష రూపాయలను రాయగా అందుకు ఆయన సంతోషంగా అంగీకరించారు. ఆ తరువాత ఖిలాఫత్‌ ఫండ్‌ కోసం ఖిలాఫత్‌ నేతలు ఉమర్‌ సోహానిని కలువగా వారికి కూడ ఆయన లక్షరూపాయాల విరాళం ఇవ్వటమే కాకుండ ఖిలాఫత్‌ కార్యాలయం ఏర్పాటుకు తన స్వంత భవంతిని అప్పగించారు. ఆ తరువాతి కాలంలో ఆ భవంతి ఖిలాఫత్‌ హౌస్‌ గా పిలువబడింది. (Muslims In India, Volume -II, Naresh Kumar Jain, Manohar, New Delhi, 1979, Page : 162).

ముహమ్మద్‌ ఉమర్‌ సోహాని చాలా ఉదార స్వభావులు. జాతీయోద్యామ కార్యక్రమాల నిర్వహణకు అవసరమగు నిధుల అందచేతలో తానెప్పుడూ ప్రథమ స్థానంలో ఉండాలన్నది ఆయన అభిమతం. ఆ కారణంగా ఉద్యమనాయకులు ఆయన సహాయం కోరివస్తే అందరి కంటె అధిక మొత్తాన్ని అందించి ఆనందించటం ఆయన అలవాటు. ఆ అలవాటుకు తగ్గట్టుగా వ్యాపారంలో ఆయన అపారంగా ఆర్జించారు. ఆ క్రమంలో ఓ మాసంలో ఆయన సంపద ద్విగుణీకృతమైంది. ఆ తరువాత దురదృష్టవశాత్తు మరుసటి నెలలో అనూహ్యంగా కోట్లాది రూపాయలను ఆయన నష్టపోయారు. ఆ నష్టంతో ఆయన బాగా క్రుంగిపోయారు. ప్రజోపకర కార్యకలాపాలకు, ప్రధానంగా జాతీయోద్యామానికి ఆర్థిక సహాయం అందించటంలో ముందు ఉండలేకపోయినందున ఆయన ప్రజా జీవితం నుండి దూరం కావాలనుకున్నారు. (Muslims In India, Page : 162).

ఆ విధంగా ప్రజా జీవితం నుండి రాజకీయాల నుండి దూరమైన సోహానిని వ్యాపారంలో వచ్చిన అపారనష్టం కల్గించిన వేదన కంటే ప్రజలకు, ఉద్యమకారులకు, జాతీయోద్యమానికి తాను ఏవిధగానూ ఉపయాగపడలక పోయాన్న దిగులు ఆయనలో అధికమయ్యింది. ఆ బాధతో సతమతమైతూ 36 సంవత్సరాల వయస్సులో 1926 లై 6న ఆయన కన్నుమూశారు. ఆ సందార్బంగా, His untimely and sudden death has removed a patriot from the country అని వ్యాఖానిస్తూ మహాత్మాగాంధీ యంగ్‌ ఇండియాలో ఆయనకు నివాళులర్పించారు.

అటువంటి ఉదార హృదయులు, త్యాగశీలుర కుటుంబంలో బేగం ఫాతిమా 1903 ఫిబ్రవరి 4వ తేదీన జన్మించారు. ఆమె తండ్రి యూసుఫ్‌ సోహాని, సోదరులు

208