పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/208

ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్రోద్యమం:ముస్లిం మహిళలు

అంగీకరించారు.

1942 ప్రాంతంలో బేగం సుల్తానా మహాత్ముని సేవాగ్రాంలో కొంతకాలం ఉన్నారు. తాత ఖాజీ నజీముద్దీన్‌తో కలసి ఆమె గాంధీజీ మార్గదర్శకత్వంలో పలు కార్యక్రమాల నిర్వహణలో పాల్గొన్నారు. సేవాగ్రాంలో ఉన్నప్పుడు ఆమె గాంధీజీకి మరింత సన్నిహితమయ్యారు. ఆమె గాంధీజీ పుస్తకాలు, ఉత్తరాలను ఉర్దూ భాషలో తర్జుమా చేస్తూ ఆయనకు సహాయపడ్డారు. ఆమె సమర్థత, సంకల్పబలం గమనించిన గాంధీజీ ఆమెను బాగా ప్రోత్సహించారు.

స్వదేశీ ఉద్యమంలో భాగంగా సాగిన విదేశీ వస్తువుల, మద్యపాన విక్రయశాలల వద్దా జరిగిన పికెటింగ్‌ కార్యక్రమాలలో సుల్తానా హయాత్‌ చురుకుగా పాల్గొన్నారు. మహాత్ముని ప్రభావం ఎంతగా ఉన్నా, స్వతంత్ర భావాలు గల ఆమె కొన్ని విషయాలలో ఆయనతో ఏకీభవించలేక వాదనకు దిగి చివరకు గాంధీజీ చేతనే శభాష్‌ అన్పించుకున్న సందర్భాలు కూడ ఉన్నాయి.

ఆనాడు కరాచిలో జరగనున్న జాతీయ కాంగ్రెస్‌ సమావేశాల సందర్భంగా వ్యకిగత సత్యాగ్రహాన్ని ఓ నియమంలా కాకుండ ఓ నీతిలా అనుసరించాలన్న ప్రతిపాదన గురించి పత్రికల్లో చర్చ జరుగుతుంది. ఆ చర్చ నేపద్యంలో సుల్తానా హయాత్‌ గాంధీజీకి

లేఖ రాశారు. ఆ లేఖలో కాంగ్రెస్‌ ప్రతిపాదనను ఆయన దృష్టికి తెస్తూ, వ్యక్తిగత సత్యాగ్రహం నియమం కాకుండ నీతి అని భావించినట్టయితే అది గాంధేయ మార్గానికి విరుద్దం కాదా? అని గాంధీజీని ఆమె ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానంగా 1942 జనవరి 27న సుల్తానా హయాత్‌కు గాంధీజీ స్వయంగా లేఖ రాస్తూ ఈ విషయం మీదా నీ అభిప్రాయం సరైనది అని పేర్కొన్నారు.

ఓసారి ఉర్దూ భాష ముస్లింల భాష అని గాంధీజీ అన్నట్టుగా పత్రికలలో వచ్చింది. అది చూసిన సుల్తానా హయాత్‌ గాంధీజీతో విభేదిస్తూ, ఉర్దూ ముస్లింల భాష ఏమాత్రం కాదు, ఇది భారతీయులందిరి భాష కాగా మీరలా ఎందుకన్నారని ప్రశ్నించారు. ఆ ప్రశ్న కు సమాధానంగా నేను అలా అనలేదు. ఏంచేద్దాం ? పత్రికలలో చాలా విషయాలు తప్పులు రాస్తున్నారు అని ఆయన సుల్తానాకు సమాధానం చెప్పాల్సి వచ్చింది.

1946లో ఆమెకు లక్నో నివాసి, పండితుల కుటుంబం నుండి వచ్చిన హయాతుల్లా అన్సారీతో వివాహం జరిగింది. ఆయన ఉన్నత విద్యావంతుడు, గొప్ప 205